WhatsApp Safety Tools feature: భారతదేశంలో 500 మిలియన్లకు పైగా ప్రజలు వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. యాప్‌ ఉపయోగించే యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీని మెయింటెయిన్ చేయడానికి, కంపెనీ దానిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ కొత్త సేఫ్టీ టూల్స్ ఫీచర్‌పై పని చేస్తోందని సమాచారం. అంటే ఒకవేళ మీకు తెలియని నంబర్ నుంచి మెసేజ్ వస్తే తర్వాత ఏమి చేయాలో మీకు సలహా ఇస్తుంది.


ఈ అప్‌డేట్ గురించిన సమాచారం వాట్సాప్ డెవలప్‌మెంట్లను పరిశీలించే వెబ్‌సైట్ Wabetainfo ద్వారా బయటకు వచ్చింది. సేఫ్టీ టూల్స్ ఫీచర్ కింద వాట్సాప్ మీకు తెలియని నంబర్‌ నుంచి మెసేజ్ వస్తే ఏం చేయవచ్చనే దానిపై మార్గనిర్దేశం చేసే పాప్ అప్ స్క్రీన్‌ను చూపుతుంది.


ఈ ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటి?
మీరు నంబర్‌పై ట్యాప్ చేసిన వెంటనే, కంపెనీ మీకు నంబర్‌ను బ్లాక్, రిపోర్ట్ చేసే ఆప్షన్‌ను ఇస్తుంది. ఇది కాకుండా ఏదైనా తెలియని నంబర్‌ నుంచి వచ్చే మెసేజ్‌కు రెస్పాండ్ అయ్యే ముందు దాని ప్రొఫైల్ పిక్చర్, బయో మొదలైనవాటిని చెక్ చేయమని వాట్సాప్ మీకు తెలియజేస్తుంది.


సేఫ్టీ టూల్స్ ఫీచర్ మీరు తెలియని నంబర్‌లతో మీరు ఏమి చేయవచ్చనే దాని గురించి సమాచారాన్ని అందించడమే కాకుండా మరో ఉపయోగం కూడా ఉంది. సాధారణంగా కొత్త నంబర్ నుంచి వచ్చిన మెసేజ్ చూస్తే... అవతలి వారికి బ్లూటిక్స్ రావడం సహజమే. కానీ దీని ద్వారా మీరు మెసేజ్ చూసినా అవతలి వారికి బ్లూటిక్స్ పడకుండా ఉండేలా చేయవచ్చు. అంటే మీరు మెసేజ్ చూశారో, లేదో అవతలి వారికి తెలియదన్న మాట. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ కొంతమంది బీటా టెస్టర్లకు వచ్చింది. రాబోయే కాలంలో కంపెనీ దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చు.


ప్రస్తుతం వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. అందులో ఒకటి యూజర్ నేమ్ ఫీచర్. ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్లుగా ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన యూజర్ నేమ్‌ను ఎంచుకోవాలి. యూజర్ నేమ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత మీరు నంబర్ తెలియకపోయినా ఎవరితో అయినా ఛాట్ చేయవచ్చు.


అంతే కాకుండా వాట్సాప్ ప్రస్తుతం మరోసారి యాప్ లుక్‌నే మార్చేసే ఫీచర్‌తో వస్తుందని తెలుస్తోంది. అదే ఛాట్ ఫిల్టర్ ఫీచర్. Wabetainfo కథనం ప్రకారం... వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.23.14.17లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని ఫీచర్ ద్వారా మనం ఛాట్లను కేటగిరీల వారీగా సపరేట్ చేసుకోవచ్చు. బిజినెస్, పర్సనల్, అన్‌రీడ్ అనే మూడు ఫిల్టర్లు ప్రస్తుతానికి ఇందులో కనిపిస్తున్నాయి. ఈ ఫిల్టర్లను మనం క్రియేట్ చేసుకోవచ్చా... లేకపోతే డీఫాల్ట్‌గా అందులో ఉన్నవే ఉపయోగించుకోవాలా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. వాట్సాప్ భవిష్యత్తు అప్‌డేట్లలో వాట్సాప్ కొత్త ఫిల్టర్ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial