Addanki In Bapatla District: యువగళం పాదయాత్ర చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అద్దంకిలో కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అద్దంకిని తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న లోకేష్ ఆదివారం అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ప్రజలు తమకు మద్దతిచ్చి టీడీపీని గెలిపిస్తే.. బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి మున్సిపాలిటీని ప్రకాశం జిల్లాలో కలుపుతామని కీలక హామీ ఇచ్చారు.


వైసీపీ ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని, సీఎం జగన్ తనపై వైసీపీ బీసీ నేతలతో మాటల దాడి చేయిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. బీసీలకు టీడీపీ హయాంలోనే న్యాయం జరిగిందన్నారు. బీసీలకు ఎవరు న్యాయం చేశారో తేలాలంటే బహిరంగ చర్చకు తాను సిద్ధమంటూ వైసీపీ నేతలకు లోకేష్ సవాల్ విసిరారు. సభలో మాట్లాడిన లోకేష్.. సైకో పోవాలి, సైకిల్ రావాలి అన్నారు. పచ్చ కండువాలు తిప్పుతూ టీడీపీ నేతలు పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపారు. అన్ని వర్గాలను మోసం చేసిన జగన్ కు బుద్ధి చెప్పాలంటే ప్రజలు టీడీపీకి ఓటు వేసి సైకో పాలనకు చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు.


అద్దంకిలో యువగళం పాదయాత్ర..
యువగళం పాదయాత్ర శనివారం (169వరోజు) గుండ్లాపల్లి క్యాంప్ సైట్ నుంచి లోకేష్ ప్రారంభించారు. అంత‌కుముందు ప్రొఫెష‌న‌ల్స్‌తో స‌మావేశ‌ం అయ్యారు. వారి సూచ‌న‌లు, స‌ల‌హాలు, స‌మ‌స్యలు విన్న ఆయన.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలకు ప‌రిష్కార‌ం చూపిస్తానని హామీ ఇచ్చారు.





సంత‌ల‌నూత‌ల‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తయిన పాద‌యాత్ర శనివారం అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. టిడిపి నేత‌లు, కార్యక‌ర్తలు, అద్దంకి ప్రజలు యువనేత లోకేష్ కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఆదివారం సైతం అద్దంకిలో లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుండగా.. స్థానికుల అభ్యర్థన మేరకు అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలుపుతామని లోకేష్ హామీ ఇచ్చారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial