AP News: అమాత్యులారా ఏం మాట్లాడుతున్నారండి.. మనస్పూర్తిగా మాట్లాడాలని భావించండి కాని, మనస్సులో మాటలను బయట పెట్టి మాకెందుకండీ తలనొప్పులు తెస్తారంటూ  సొంత పార్టీ నేతలే కామెంట్స్ చేస్తున్నారు.


చర్చకు దారితీస్తున్న ఏపీ మంత్రుల కామెంట్స్...
గత కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే అది కామన్ అని అనుకోవచ్చు కానీ, సొంత పార్టీలోని నాయకులే మంత్రుల తీరుపై ఇదేంటి అమాత్య అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. తాజాగా మంత్రి సిదిరి అప్పలరాజు చేసిన కామెంట్స్ ఇదే కోవలోకి వచ్చాయి. పైగా ఆయన మామూలు చదువులు కాదు, ఎంబీబీఎస్ చదివి డాక్టర్ గా సేవలందించారు. టెన్త్ క్లాస్ లో స్టేట్ టాపర్లలో ఒకరని తెలిసిందే. విజయవాడ కేంద్రంగా మూడు రోజులపాటు సముద్ర ఉత్పత్తుల పై ఫుడ్ ఎక్స్ పో ను నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభం సందర్బంగా నిర్వహించిన సభలో మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడారు. ఇలాంటి ప్రదర్శలను అన్ని జిల్లాల్లోనూ నిర్వహించాలని అంటూ పని లో పనిగా తిరుమలలో నిర్వహించాలని అభిప్రాయాలు వచ్చాయన్నారు. అయితే తిరుమలలో మాంసాహారానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగోదని, తానే వద్దన్నానని మంత్రి చెప్పారు. అయితే ఇక్కడే మరో విషయం ఉంది. తిరుపతిలో అనాల్సిందిపోయి, మంత్రి తిరుమల అనేశారు. దీంతో ఆయన మాటలపై సభలోనే విమర్శలు వచ్చాయి. ఇది విన్న పార్టీ నేతలే అప్పలరాజు మాటలపై అసహనంగా ఉన్నారు.


అదేంటీ అట్లాగన్నారు...
మంత్రి సిదిరి అప్పలరాజు ఏకంగా తిరుమలలో నాన్ వెజ్ ఎక్స్ పో నిర్వాహణపై కామెంట్స్ చేయటంతో ఆ విషయం మీడియాలో వైరల్ గా మారింది. అది కాస్త పార్టీ నాయకులకు చేరింది. దీని పై సొంత పార్టీ నేతలే ఆశ్చర్యానికి గురవుతున్నారు. సున్నితమయిన అంశం అని తెలిసినప్పటికీ, ఎవరో చెప్పారని చెప్పాల్సిన అవసరం కూడ ఆ వేదికపై  లేదుకదా అనే అభిప్రాయం పార్టి నాయకుల నుంబచే వ్యక్తం అవుతోంది. ఇలాంటి విషయాలు ఆచితూచి వ్యవహరించాల్సి ఉన్నప్పటికి మంత్రిగా మాటలను సైతం పొదుపుగా వాడటంతో హుందాతనం కాపాడుకోవాల్సి ఉంటుందని అధికార వైసీపీ నాయకుల్లోనే వెల్లడవుతుంది. అసలు జరిగే కార్యక్రమం ఏంటి, మంత్రి నోట వెంట తిరుమల, తిరుపతి విషయాలు ఎందుకు రావాల్సి వచ్చిందంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. పార్టీలో జరుగుతున్న చర్చ మంత్రి సిదిరి అప్పలరాజు వరకు వెళ్ళటంతో తన వివరణ ఇచ్చేందుకు కూడా ఆయన ప్రయత్నించారని అంటున్నారు.
మంత్రుల తీరుపై...
మంత్రి సిదిరి అప్పలరాజు మంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన వ్యక్తుల్లో ఒకరు. అయితే మూడు నెలల కిందట మంత్రి సిదిరి అప్పల రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నిరాజేశాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో  తెలంగాణా ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొంటామంటూ, తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ పై మంత్రి సిదిరి ఫస్ట్ రియాక్ట్ అయ్యారు. ఆయన దూకుడుగా కామెంట్స్ చేయటం పార్టిలో చర్చకు దారితీసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టి హైకమాండ్ కు కూడ చేరటంతో, పార్టీ పెద్దలు ఆయన్ని పిలిపించి మరి వార్నింగ్ ఇచ్చారని  ప్రచారం పార్టిలోనే పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు మరోసారి మంత్రి అప్పల రాజు చేసిన కామెంట్స్ సొంత పార్టి నేతల్లోనే హైలైట్ కావటం విశేషం.