IIT Bombay:


వెజ్ వర్సెస్ నాన్‌వెజ్


ఐఐటీ బాంబేలోని హాస్టల్‌లో వివాదం తలెత్తింది. క్యాంటీన్‌లో ఓ విద్యార్థి నాన్‌ వెజ్ తినడంపై వెజిటేరియన్స్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.  దీనిపై మాటమాట పెరిగి పెద్ద వివాదానికి దారి తీసింది. నాన్‌ వెజిటేరియన్స్‌పై వివక్ష చూపిస్తున్నారని కొంతమంది విద్యార్థులు గొడవకు దిగారు. ఫలితంగా...వెజిటేరియన్స్ అంతా కలిసి క్యాంటీన్‌ ముందు పోస్టర్‌లు అంటించారు. "వెజిటేరియన్స్‌ మాత్రమే క్యాంటీన్‌లో కూర్చునేందుకు అనుమతిస్తాం" అని పోస్టర్లు పెట్టారు. అంతే కాదు. నాన్‌ వెజ్ తినే వాళ్లందరినీ బలవంతంగా క్యాంటీన్ నుంచి బయటకు పంపేశారు. దీనిపై కొందరు విద్యార్థులు RTI ఫైల్ చేశారు. ఫుడ్ విషయంలో ఐఐటీ బాంబే ఓ పాలసీ అంటూ ఏమీ పాటించడం లేదని, కానీ ఇక్కడ నాన్‌వెజ్,వెజ్ అంటూ వేరు వేరు కుర్చీలు వేస్తున్నారని తేలింది. దీనిపై నాన్‌ వెజిటేరియన్స్ తీవ్రంగా మండి పడుతున్నారు. పలువురు విద్యార్థులు ట్విటర్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. యాజమాన్యం ఎలాంటి రూల్స్ పెట్టకపోయినా కొందరు వ్యక్తులు కావాలనే ఇలా రూల్స్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆహారపు అలవాట్ల ఆధారంగా ఓ మనిషిని ఎలా అంచనా వేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై ఇప్పటి వరకూ IIT బాంబే డైరెక్టర్ స్పందించలేదు. 2018లోనూ ఇక్కడ ఇలాంటి వివాదమే విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టింది. నాన్‌ వెజ్‌ తినే వాళ్లకు సెపరేట్ ప్లేట్‌లు పెట్టాలని డిమాండ్ చేశారు వెజిటేరియన్లు. ఇప్పుడు మరోసారి ఇలాంటి వివాదమే చెలరేగింది.