టీడీపీ, జనసేనతో బీజేపీ కలుస్తుందా ? కర్ణాటక ఫలితాల తర్వాత క్లారిటీ వస్తుందా ?


ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లేందుకు జనసేన ఆసక్తి చూపుతోంది. ఆ విషయాన్ని నాదెండ్ల మనోహర్ చాలా స్పష్టంగా చెబుతున్నారు. మరి బీజేపీ పయనం ఎటు ? అనేది చర్చనీయాంశంగా మారింది. 2014 కూటమి మళ్లీ కలిసి పోటీ చేయాలని కొంత మంది బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. అయితే వీరిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోందన్న లీకులు కూడా ఇస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు మోదీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. కానీ ఎన్డీఏలో చేరిక గురించి మాత్రం ఏమీ చెప్పడం లేదు. ఇంకా చదవండి


కార్మికులకు సీఎం కేసీఆర్ మే డే శుభవార్త


మే డే సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పారిశుధ్య కార్మికులకు శుభవార్త చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రూ.1000 మేర పెంచుతూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా 1 లక్షా 6 వేల 474 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. మే నెల నుంచి పెరిగిన వేతనాలను పారిశుధ్య కార్మికులు అందుకోనున్నారు. పనిలో పనిగా ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసి కార్మికుల వేతనాల పెంపునకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై పారిశుధ్య కార్మికులు హర్షం చేస్తున్నారు. ఇంకా చదవండి


ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్


ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు DA మంజూరు చేసింది సర్కార్. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన DA ను మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు DA జీవో 66 ద్వారా, పెన్షనర్లకు జీవో 67 ద్వారా 2.73% మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం. జూన్ నుంచి సవరించిన వేతనాలను ఉద్యోగులు అందుకోనున్నారు. ఈ కొత్త DA ను జూలై 1, 2023 నుంచి జూన్ జీతంతో కలిపి ఇచ్చేవిధంగా  ఏర్పాటు చేశారు. ఇంకా చదవండి


దుర్మార్గుడిని పొగిడితే ప్రశ్నించాం - రజనీపై వ్యాఖ్యలను సమర్థించుకున్న వైఎస్ఆర్‌సీపీ !


సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆ పార్టీ సమర్థించుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ అంశంపై స్పందించింది. 5 కోట్ల మంది ప్రజలు తీర్పునిస్తే 23 సీట్లకు పరిమితమైన పార్టీ  టీడీపీ అని.. మూడు సార్లు దారుణంగా ఓడిపోయారని వైసీపీ విమర్శించారు.  సొంత ఊరిలో ఓడిపోయి కుప్పానికి పరిగెత్తిన ఫెయిల్యూర్ పాలిటీషియన్.. ఏపీని నాశనం చేసిన ఓ దుర్మార్గుడిని పొగిడితే ప్రశ్నించడం ఏ మాత్రం తప్పు కాదని స్పష్టం చేసింది. ఇంకా చదవండి


ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మూడో చార్జిషీట్ - అందులో ఏముందంటే ?


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మూడో చార్జిషీటు దాఖలు చేసింది.  మనీలాండరింగ్, హవాలా వ్యవహారాల్లో కల్వకుంట్ల కవిత కీలకమని పేర్కొంది. మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కవిత సమావేశమయ్యారని వెల్లడించింది. అరుణ్ పిళ్లైకి కవితనే డబ్బు సమకూర్చినట్లు ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్‌లో కవిత ప్రతినిధిగా పిళ్లై, రాఘవ ప్రతినిధిగా ప్రేమ్ మండూరి వ్యవహరించారని చెప్పింది. అరుణ్ పిళ్లైకి కవితనే డబ్బు సమకూర్చారని తెలిపింది. మద్యం వ్యాపారం ద్వారా వచ్చిన రూ.192 కోట్లతో హైదరాబాద్ లో భూములు కొనుగోలు చేశారని ఈడీ చార్జిషీట్‌లో తెలిపింది. ఇంకా చదవండి


కొత్త సెక్రటేరియట్ లోకి ఎంపీకే ఎంట్రీ లేదు, సామాన్యుల పరిస్థితి ఏంటి?: రేవంత్ రెడ్డి ఫైర్


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొత్త సెక్రటేరియట్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దాంతో టెలిఫోన్ భవన్ వద్ద ఓ గంటపాటు ఉద్రిక్తత నెలకొంది. రేవంత్ రెడ్డికి పర్మిషన్ లేని కారణంగా ఆయనను సచివాలయానికి వెళ్లనిచ్చేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులతో వాగ్వివాదం అనంతరం రేవంత్ రెడ్డి అక్కడినుంచి అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. ప్రజా ప్రతినిధిని, ఎంపీని అయిన తనకే సెక్రటేరియట్ లోకి అనుమతి లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కొత్త సెక్రటేరియట్ లోకి ఎంపీ అయిన తనకే ఎంట్రీ లేదని, సామాన్యుల పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాను మునిసిపల్, హెచ్.ఎం.డి.ఎ అధికారులను కలిసి సమాచార హక్కు కింద దరఖాస్తు చేయడానికి వెళ్తున్నానని చెప్పినా పోలీసులు అనుమతించలేదు. ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం తనను అడ్డుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇంకా చదవండి


ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది కొరత ఉండకూడదు, నియామకాలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్


ప్రభుత్వ ఆస్పత్రుల్లో  సిబ్బంది లేరనే మాట వినిపించకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అవసరం అయిన మేరకు నియామకాలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇంకా చదవండి


తిరుమలలో ఉగ్రవాదుల చొరబాటు! హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు


కలియుగదైవం కొలువైన తిరుమలలో ఉగ్రవాదులు చొరబడ్డారంటూ పోలీసులకు సమాచారం రావడం కలకలం రేపింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉగ్రవాదులు తిరుపతిలో సంచరిస్తున్నారని పోలీసులకు, టీటీడీకి  మెయిల్ చేశాడు. ఆ వ్యక్తి మెయిల్ తో తిరుపతి అర్బన్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. పోలీస్ అధికారులు తిరుమల ఆలయంలో ప్రవేశించే అవకాశం ఉందని అనుమానించి.. టీటీడీ భద్రతాధికారులని అప్రమత్తం చేశారు. దాంతో తిరుమలలోభద్రతాధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇంకా చదవండి


తెలుగు సినిమా సత్తా - ‘సీతారామం’, ‘బలగం’ సినిమాలకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు


మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ’సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వం వచ్చిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కీలక పాత్రలో నటించింది. ఆర్మీ ఆపరేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమ కథ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీకి ఫిదా అయ్యారు. వై జయంతి మూవీస్ బ్యానర్ మీద సి.అశ్విని దత్త్ రూ.30 కోట్లతో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. దుల్కర్‌ సల్మాన్, మృణాల్ యాక్టింగ్ కు ప్రేక్షకులు మైమరచిపోయారు. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేసింది.విమర్శకుల ప్రశంసలు పొందిన  ‘సీతారామం’ చిత్రానికి అరుదైన అవార్డు లభించింది. 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో జ్యూరీ క్యాటగిరిలో బెస్ట్ మూవీగా అవార్డుని అందుకుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇంకా చదవండి


తక్కువ స్కోరును కాపాడుకున్న బెంగళూరు - లక్నోపై 18 పరుగులతో విజయం!


ఐపీఎల్‌ 2023 సీజన్ 43వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తక్కువ స్కోరును కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ 19.5 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంకా చదవండి