Punjab Kings vs Royal Challengers Bangalore: ఐపీఎల్‌ 2023 సీజన్ 43వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తక్కువ స్కోరును కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ 19.5 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ అయింది.


లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్‌మెన్‌లో కృష్ణప్ప గౌతం (23: 13 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బెంగళూరు బ్యాటర్లలో ఫాఫ్ డు ప్లెసిస్ (44: 40 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్‌కు మూడు వికెట్లు దక్కాయి.