Punjab Kings vs Royal Challengers Bangalore: ఐపీఎల్‌ 2023 సీజన్ 43వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తడబడింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూరు బ్యాటర్లలో ఫాఫ్ డు ప్లెసిస్ (44: 40 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్‌కు మూడు వికెట్లు దక్కాయి. లక్నో విజయానికి 120 బంతుల్లో 127 పరుగులు కావాలి.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (31: 30 బంతుల్లో, మూడు ఫోర్లు), ఫాఫ్ డు ప్లెసిస్ (44: 40 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) నిదానంగా ఆడారు. కానీ కావాల్సిన స్టార్ట్ అయితే దొరికింది. విరాట్ కోహ్లీ కొన్ని భారీ షాట్లకు ప్రయత్నించినా కనెక్ట్ అవ్వలేదు. మొదటి వికెట్‌కు 62 పరుగులు జోడించిన అనంతరం రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ భారీ షాట్ కొట్టబోయి స్టంపౌట్ అయ్యాడు.


రాట్ అవుటయ్యాక వచ్చిన అనుజ్ రావత్ (9: 11 బంతుల్లో), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (4: 5 బంతుల్లో), సుయాష్ ప్రభుదేశాయ్ (6: 7 బంతుల్లో) కూడా ఘోరంగా విఫలం అయ్యారు. 15 ఓవర్ల అనంతరం వర్షం కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. ఆ తర్వాత కూడా బెంగళూరు బ్యాటర్లు పెద్ద గొప్పగా ఏమీ ఆడలేదు. ఓపెనర్లు ఇద్దరూ కాకుండా కేవలం దినేష్ కార్తీక్ (16: 11 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) మాత్రమే రెండంకెల స్కోరు చేరుకున్నాడు. ఇన్నింగ్స్ మొత్తంలో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు మాత్రమే నమోదయ్యాయి. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. అతను బ్యాటింగ్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్‌కు మూడు వికెట్లు దక్కాయి. రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా రెండేసి వికెట్లు తీసుకున్నారు. కృష్ణప్ప గౌతమ్ ఒక వికెట్ పడగొట్టాడు.




రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హాజిల్‌వుడ్


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, వైశాక్, బ్రేస్‌వెల్, సోను యాదవ్.


లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కృష్ణప్ప గౌతం, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్


లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ఆయుష్ బదోని, డేనియల్ సామ్స్, అవేష్ ఖాన్, క్వింటన్ డి కాక్, ప్రేరక్ మన్కడ్.