మే 2 రాశిఫలాలు
మేష రాశి
ఈ రాశి వ్యాపారులు సక్సెస్ ఫుల్ గా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఆదాయ మార్గాలు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. అనవసర ఖర్చులను నియంత్రించుకోండి. భవిష్యత్తు కోసం పొదుపు చేయగలుగుతారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది.ఉద్యోగాన్ని, కుటుంబాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తారు. కార్యాలయంలోని సీనియర్లు మీ పనిలో మీకు సహాయం చేస్తారు. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. వైవాహిక జీవితం బావుంటుంది.
వృషభ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. తలపెట్టిన పనులు సృజనాత్మకంగా పూర్తిచేస్తారు. మానసిక సంతృప్తిని పొందుతారు. కుటుంబంలో కొన్ని కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేస్తారు. భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో లాభం ఉంటుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీ కుటుంబం, పిల్లలపై పూర్తి శ్రద్ధ చూపుతారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
మిథున రాశి
ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది. గొప్ప అవకాశాలను పొందుతారు. కార్యాలయంలో పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. జీతం పెరగడంతో పాటు మీ హోదా కూడా పెరుగుతుంది. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు పెరుగుతాయి. ప్రేమికులకు మంచి రోజు. మీ తెలివితేటలు, విచక్షణతో మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ప్రభుత్వ రంగంలో ఉండే వ్యక్తులు లాభపడతారు. కుటుంబ జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని కొత్త నిర్మాణాలను పూర్తి చేయడం ద్వారా ఇంటిని చక్కదిద్దేందుకు ప్లాన్ చేసుకుంటారు.
Also Read: మే నెలలో ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుంటుంది
కర్కాటక రాశి
కార్యాలయంలో మీ పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. మీ పనిలో కొత్త మార్పు ఉంటుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీకు అనుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. అనవసర ఆందోళనలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. విద్యార్థులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది.
సింహ రాశి
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఆస్తికి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. వ్యాపారంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి కానీ త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయి. స్నేహితులు , బంధువులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. మీలో ఆధ్యాత్మిక ఆలోచనలు వస్తాయి. మీరు ప్రయాణం చేయాల్సి రావొచ్చు.
కన్యా రాశి
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. ఈ రోజు మీరు చిన్న విషయాలపై శ్రద్ధ చూపుతారు..ఇది మీ పని ప్రదేశంలో ప్రయోజనం కలిగిస్తుంది. మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీకు అనుభవజ్ఞుడైన వ్యక్తి మద్దతు లభిస్తుంది. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీ ప్రయత్నం సఫలం అవుతుంది.
తులా రాశి
ఈ రోజు మంచిగా ప్రారంభమవుతుంది. మీరు మీ సామర్థ్యాన్ని విశ్వసిస్తూ ముందుకు సాగుతారు. కార్యాలయంలో గౌరవం పొందుతారు. మీరు కొత్త ఆదాయ వనరులను పొందే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారంలో లాభం పొందుతారు. డబ్బును పొదుపుచేసుకోగలుగుతారు. స్నేహితల ద్వారా లాభపడతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారికి ఈ రోజు కలిసొస్తుంది. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మీరు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకుంటారు. మీ సామాజిక సర్కిల్ పెరుగుతుంది. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవద్దు..ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మీ వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. బాగా డబ్బు సంపాదిస్తారు. కుటుంబ సమేతంగా ఓ కార్యక్రమానికి వెళ్తారు.సన్నిహితులను కలుస్తారు.
Also Read: 'మే' నెలలో మొదటి వారం ఈ రాశులవారు నిర్లక్ష్యంగా ఉంటే సక్సెస్ దూరమైపోతుంది
ధనుస్సు రాశి
మీరు మతపరమైన పనిలో చురుకైన పాత్ర పోషిస్తారు. సోదరుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. సంతోషకరమైన వాతావరణంలో రోజంతా గడుపుతారు. మీరు మీ పని రంగంలో మంచి పనితీరు కనబరుస్తారు. ధనలాభం పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే, ఈరోజు మీకు శుభవార్త అందుతుంది. స్నేహితులతో కలిసి ఒక ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులను కలుస్తారు.
మకర రాశి
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు అవుతుంది. నిలిచిపోయిన డబ్బు ఈరోజు తిరిగి వస్తుంది. మీరు మీ పని ప్రాంతంలో విజయవంతమైన శిఖరాలను చేరుకుంటారు. మీ శక్తి పెరుగుతుంది. మీరు ఉద్యోగంలో ఆశించిన పురోగతిని పొందుతారు. సమాజంలో మీ పేరు కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి వాతావరణం ఉంటుంది. రోజంతా బిజీగా ఉండడం వల్ల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టరు. ఇది మీకు సమస్యలను కలిగిస్తుంది.
కుంభ రాశి
అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు సమర్థతతో మీపనిని పూర్తిచేస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. ప్రశాంతంగా ముందడుగు వేస్తారు. స్నేహితుడు లేదా సోదరుడి నుంచి డబ్బు పొందే అవకాశం ఉంది. కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీన రాశి
ఈ రోజు మీకు నిన్నటి కన్నా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందుతుంది. మీ పనుల్లో కొంత ఆటంకం ఏర్పడుతుంది. ఎదురైన సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. ఈ రోజు మీరు ఆర్థిక విషయాలలో మీ పెద్దల సలహా తీసుకుంటారు. వ్యాపారానికి సంబంధించి ప్రయాణం ఉంటుంది.