Top 10 Headlines Today
కాంగ్రెస్ ఎఫెక్ట్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఇతర రాష్ట్రాలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు, వాటి అమలు తీరు తెన్నులను దృష్టిలో పెట్టుకుని, అన్ని వర్గాలను ఆకర్షించేలా ఆయన హామీల ప్రకటన చేశారు. 2018లో 3 రోజుల ముందే మేనిఫెస్టో విడుదల చేయగా, ఈసారి 45 రోజుల ముందే మేనిఫెస్టోను ప్రకటించడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సమన్వయ కమిటీ
తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలతో జనసేనతో సమన్వయం కోసం ప్రత్యేకంగా కమిటీ నియమించింది. సభ్యులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ పొలిట్ బ్యరో సభ్యులు, శాసనమండలి సభ్యుడు యనమల రామకృష్ణుడు, పీఏసీ ఛైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను నియమించారు. వీరంతా ఇరు పార్టీల సమన్వయం కోసం పని చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ప్రత్యర్థులు వీళ్లే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ 55 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ వంటి నేతలకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు దక్కాయి. సిట్టింగ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన సతీమణి పద్మావతి రెడ్డికి కోదాడ టికెట్ కేటాయించారు. కొడంగల్ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేయనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
చంద్రబాబు హెల్త్ బులెటిన్
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు హెల్త్ బులిటెన్ (Chandrababu Health Bulletin) విడుదల చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్టైయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు. డీహైడ్రేషన్ కు గురయ్యాక చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తోందని, గుండె సమస్య వచ్చే ప్రమాదం ఉందని కుటుంబసభ్యులతో పాటు టీడీపీ నేతలు, ఆయన తరఫు లాయర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన 67 కేజీలు బరువు ఉన్నారని ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులె టిన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రాహుల్ టూర్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 18 నుంచి పార్టీ నేతలు బస్సుయాత్ర చేస్తున్నారు. తొలిరోజు బస్సుయాత్రలో పార్టీ నేతలతో కలిసి రాహుల్ గాంధీ పాల్గొంటారు. ములుగు జిల్లాలో 18న యాత్ర ప్రారంభం కానుంది. అదే రోజు సాయంత్రం 4గంటలకు రామప్ప టెంపుల్‌ను రాహుల్ సందర్శిస్తారు. రాత్రి భూపాలపల్లిలో నిరుద్యోగ యువతతో కలిసి పాదయాత్ర చేయనున్నారు. 19న రామగుండంలో సింగరేణి కార్మికులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. రామగుండం నుంచి పెద్దపల్లి వరకు రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేయనున్నారు. పెద్దపల్లిలో జరిగే బహిరంగసభలో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. రాత్రికి కరీంనగర్‌లో కాంగ్రెస్ నేతలతో కలిసి రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారు. 20న బోధన్‌లో బీడీ కార్మీకులు గల్ఫ్ బాధిత కుటుంబాలతో రాహుల్ సమావేశం కానున్నారు. బోధన్ నుంచి ఆర్మూర్‌కు బస్సులో ప్రయాణం చేయనున్నారు. ఆర్మూర్‌లో పసుపు, చెరుకు రైతులతో రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాత్రి 7 గంటలకు నిజామాబాద్‌లో రాహుల్‌గాంధీ పాదయాత్ర చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఎవరు గెలిచినా బోణీ
ప్రపంచ కప్‌లో 14వ మ్యాచ్ ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా రెండు జట్లూ టోర్నీలో మొదటి విజయం సాధించాలని భావిస్తున్నాయి. ఆస్ట్రేలియా జట్టు తన తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్, దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోగా, శ్రీలంక జట్టు తన తొలి రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ల చేతిలో ఓడిపోయింది పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
షుగర్‌పై ఫోకస్
కేంద్ర ప్రభుత్వం చక్కెర వ్యాపారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. చక్కెర వ్యాపారం చేస్తున్న చట్టబద్ధ కంపెనీలన్నీ ఈ నెల 17లోగా, స్టాక్ వివరాలు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొన్ని సంస్థల వద్ద పెద్ద మొత్తంలో నివేదించని చక్కెర నిల్వలు ఉన్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ షుగర్ అండ్ వెజిటెబుల్ ఆయిల్ గుర్తించినట్లు ఆహార శాఖ తెలిపింది. గత నెలలోనే నిల్వ వివరాలు ఇవ్వాలని ఆదేశించినా పలు సంస్థలు పట్టించుకోలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. టోకు, రిటైల్ వ్యాపారులతో పాటు ప్రాసెసర్లు సైతం చక్కెర నిల్వల వివరాలను ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఐఫోన్ పోగొట్టుకున్న నటి
ఊర్వశి రౌతేలా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండితెరపై అందాల ఆరబోతతో రచ్చ చేసే ఈ బాలీవుడ్ బ్యూటీ.. ఐటమ్ గర్ల్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. గతంలో క్రికెటర్లతో డేటింగ్ రూమర్స్ తో వార్తల్లో నిలిచిన ఈ భామ.. ఇప్పుడు క్రికెట్ స్టేడియంలో ఫోన్ పోగొట్టుకొని వార్తల్లోకి ఎక్కడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
విగ్గుపై పెట్టుకుంటే తప్పేంటీ?
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ రామ్‌ప్రసాద్ తనకు ఎప్పటి నుంచో తెలుసన్న బాలయ్య, తామంతా కలిసి భోజనం చేసేవారిమని అన్నారు. అప్పట్లో కారవాన్‌లు లేవని, చాప, దిండు వేసుకుని నేలపైనే పడుకునేవాళ్లమన్నారు. ఆ సమయంలో విగ్గు తీసేవాణ్ని అని వెల్లడించారు. మొన్న ఎవడో అన్నాడు వెధవ, విగ్గు పెట్టుకుంటాడు అని ఎగతాళిగా మాట్లాడాడని మండిపడ్డారు. అవునయ్యా విగ్గు పెట్టుకుంటా, నువ్వు ఎందుకు గడ్డం పెట్టుకున్నావని అడిగానా ? మనదంతా ఓపెన్ బుక్, ఎవరికీ భయపడేదే లేదని హెచ్చరించారు పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
లిప్ లాక్ తప్పనిసరా?
నేచురల్ స్టార్ నాని సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. సినిమాలు కమర్షియల్‌గా ఎంటర్‌టైన్ చేసినా చేయకపోయినా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంటాయి అనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో సంపాదించుకున్నారు నాని. ఇక త్వరలోనే ‘హాయ్ నాన్న’ అనే మరో ఫ్యామిలీ డ్రామాతో థియేటర్లలో సందడి చేయనున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలయ్యింది. టీజర్ లాంచ్ వేడుకలో నానితో పాటు ఇతర మూవీ టీమ్ కూడా పాల్గొని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు ‘హాయ్ నాన్న’ విశేషాలను పంచుకున్నారు. అదే సమయంలో ప్రతీ సినిమాలో లిప్ లాక్ చేయడం గురించి నానికి ప్రశ్న ఎదురవ్వగా దానికి సింపుల్‌గా సమాధానమిచ్చారు నాని. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి