ICC Cricket World Cup 2023: ప్రపంచ కప్‌లో 14వ మ్యాచ్ ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా రెండు జట్లూ టోర్నీలో మొదటి విజయం సాధించాలని భావిస్తున్నాయి. ఆస్ట్రేలియా జట్టు తన తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్, దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోగా, శ్రీలంక జట్టు తన తొలి రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ల చేతిలో ఓడిపోయింది.


పాయింట్ల పట్టికలో శ్రీలంక ఎనిమిదో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా అట్టడుగున అంటే పదో స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య మంచి మ్యాచ్ జరుగుతుందని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రపంచ కప్‌ను గెలుచుకునే బలమైన పోటీదారుల్లో ఆస్ట్రేలియా జట్టు ఒకటిగా వచ్చింది. బలమైన శ్రీలంక జట్టు కూడా తన మొదటి రెండు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. అందువల్ల ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మంచి మ్యాచ్ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో చూద్దాం.


పిచ్ ఎలా ఉంది?
సాధారణంగా లక్నోలోని ఎకానా స్టేడియం పిచ్ నెమ్మదిగా ఉంటుంది. ఇక్కడ పరుగులు చేయడం కష్టం, కానీ గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి ఎకానా స్టేడియం చరిత్రలో అత్యధిక వన్డే స్కోరు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే ఆట సాగుతున్న కొద్దీ పిచ్ బౌలర్లకు మరింత సహాయం అందించడం ప్రారంభించింది. అందువల్ల చివరి మ్యాచ్‌లోని పిచ్‌ను పరిశీలిస్తే, టాస్ గెలిచిన తర్వాత జట్టు మొదట బ్యాటింగ్ చేయడం ఉత్తమం. ఎందుకంటే తరువాత బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.


రెండు జట్లలో ప్లేయింగ్ ఎలెవన్ ఎలా?
ఆస్ట్రేలియా తుదిజట్టు (అంచనా)
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్


శ్రీలంక గురించి చెప్పాలంటే... వారి కెప్టెన్ దసున్ షనక గాయం కారణంగా టోర్నీకి దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో అద్భుతమైన సీమ్ బౌలర్, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ కూడా చేసే సామర్థ్యం ఉన్న చమికా కరుణరత్నే ఎంపిక అయ్యాడు. అందువల్ల చమికకు కూడా ఆస్ట్రేలియాతో ఆడే అవకాశం లభించవచ్చు. దీంతో పాటు యువ ఫాస్ట్ బౌలర్ మతిషా పతిరానాకు కూడా కుడి భుజంలో సమస్య ఉంది. అటువంటి పరిస్థితిలో అతను ఆడతాడని ఖచ్చితంగా చెప్పలేము.


శ్రీలంక తుదిజట్టు (అంచనా)
పతుం నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కెప్టెన్, వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ్ డి సిల్వా, దునిత్ వెలలెజ్, చమిక కరుణరత్నే, మహిష్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మదుశంక


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial