Top 10 Headlines Today:


 


ఆఖరి నిమిషంలో మార్పులు 


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో ఉంచిన ఐదు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. దీనికి సంబంధించి చివరి విడత జాబితాను ప్రకటించింది. చార్మినార్ - ముజీబ్ షరీఫ్, తుంగతుర్రి (ఎస్సీ) - మందుల సామ్యూల్, పటాన్ చెరు - కట్టా శ్రీనివాస్ గౌడ్, మిర్యాల గూడ - బాతుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట్ - రామిరెడ్డి దామోదర్ రెడ్డిలను ఖరారు చేస్తూ జాబితా విడుదల చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అల్పపీడనం


ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 కాంగ్రెస్‌పై నెగెటివ్ ప్రచారం 


భారత రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్ ( Congress ) మాటే వినిపిస్తోంది. కేసీఆర్, కేటీఆర్ లేదా  మరి ఎవరైనా సరే  పదే పదే కాంగ్రెస్ పార్టీని ప్రస్తావిస్తున్నారు.  కాంగ్రెస్ గెలిస్తేఏదో జరిగిపోతుందని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు.   కాంగ్రెస్ గెలిస్తే అది జరుగుతుంది.. ఇది జరుగుతుందని ప్రజల్ని భయపెట్టేందుకు కేసీఆర్ ( KCR )  ప్రయత్నిస్తున్నారు.   ఇందు కోసం  ఆయన నేరుగా కాంగ్రెస్ గెలిస్తే అనే పదం వాడేస్తున్నారు. కేటీఆర్ కూడా అంతే. కాంగ్రెస్‌పై ప్రజల్లో ఈ విధంగా వ్యతిరేకత పెంచితే..బీఆర్ఎస్‌కు  మేలు జరుగుతుందాద? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


జగన్‌పై గంటా పంచ్‌లు  


'నిన్నటివరకూ 'గడపగడపకూ వైసీపీ' అన్నారు. ఇప్పుడు 'వై ఏపీ నీడ్స్ జగన్' (Why AP Needs Jagan)అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. వైసీపీ నేతలు ప్రతి గడపలోనూ అవమానంతో వెనుదిరుగుతున్నారు. నేడు ఏపీ హేట్స్ జగన్, నిన్ను నమ్మం జగన్' అంటూ ప్రజలే ఎదురు తిరుగుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) మండిపడ్డారు. ఈ మేరకు సీఎం జగన్ (CM Jagan) కు ఆయన ట్విట్టర్ వేదికగా 20 ప్రశ్నలు సంధించారు. వీటికి జగన్ రెడ్డి, మంత్రులు, సలహాదారులు, ఎవరో ఒకరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీ మూర్ఖత్వపు పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, ఈ రాష్ట్రానికి జగన్ ఎందుకు వద్దో చెప్పడానికి నా వద్ద సవాలక్ష కారణాలున్నాయంటూ విమర్శించారు. నవరత్నాలను నవ మోసాలుగా పేర్కొన్న గంటా, ఏ ఒక్క రత్నాన్ని సరిగ్గా అమలు చేయలేదని దుయ్యబట్టారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ప్రచారం @ ఆన్ లైన్


ఎన్నికల ప్రచారం అంటే పోస్టర్లు, పాంప్లెట్లు, ప్రచార వాహనాలు, మైకులు, బహిరంగసభలు. అంతేనా  ఇదంతా పాతకాలపు ప్రచారం ఇప్పుడు అసలైన ప్రచారం ఆన్ లైన్ జరుగుతోంది. సోషల్ మీడియా ( Social  Media )  ప్రచారం అంటే.. పోస్టులు పెట్టడం.. బాట్స్ పెట్టి షేర్లు చేసుకోవడం.. పార్టీ సోషల్ మీడియా సైన్యాలతో పాజిటివ్ ప్రచారం చేసుకోవడం నిన్నామొన్నటిదాకా కొత్త స్టైల్. కానీ ఇప్పుడు ఇన్ ఫ్లూయన్సర్స్ ను రంగంలోకి దింపేశారు. బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో దూకుడుగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


విశాఖ వాసులకు అలర్ట్ 


తరచూ విశాఖపట్నానికి విమానంలో రాకపోకలు సాగించే వారికి అలర్ట్. త్వరలో విశాఖపట్నం విమానాశ్రయాన్ని రాత్రి వేళ మూసివేయనున్నారు. ఈ నెల 15 నుంచి ఈ మూసివేత అమలు అవుతుందని ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పారు. ఎయిర్ పోర్టు రన్‌ వే పునరుద్ధరణ పనులు చేయాల్సి ఉందని, అందుకోసం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఎయిర్ పోర్టును పూర్తిగా మూసివేయనున్నట్టుగా వెల్లడించారు. రాత్రిపూట విమానాలు ఏవీ విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరడం గానీ, రావడం కానీ ఉండదని స్పష్టం చేశారు. ఈ రన్‌ వే పునరుద్ధరణ పనులు పూర్తి అవ్వడానికి దాదాపు 4 నుంచి 6 నెలల టైం పడుతుందని ఎయిర్ పోర్టు అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


నేడే లాస్ట్


తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. ఈ నెల 10న నామినేషన్ల ( Nominations ) ఘట్టానికి తెరపడనుంది. ఈ నెల 3వ తేదీతో ప్రారంభమైన నామినేషన్ల పర్వం శుక్రవారంతో పూర్తవుతుంది.  గురువారం ఏకాదశి కూడా కావడంతో మంచి రోజని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు పెద్ద ఎత్తున నామినేషన్ల దాఖలు చేశారు. చివరి రోజున మరకొంత మంది నామినేషన్లు వేయనున్నారు. అయితే ఇప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేకపోయాయి.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పాకిస్థాన్ అవుట్


భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరాలన్న పాకిస్థాన్‌ ఆశలపై న్యూజిలాండ్‌ దాదాపుగా నీళ్లు పోసినట్లే కనిపిస్తోంది. శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించడంతో పాక్‌ సెమీస్‌ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. శ్రీలంకపై కివీస్‌ 160 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి పాకిస్థాన్‌కు కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. ఒకవేళ ఇప్పటికీ పాకిస్థాన్‌ సెమీస్‌ చేరాలంటే అద్భుతమే జరగాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


జిగర్తాండా డబుల్ఎక్స్ కి అదే ప్రాణం


రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్యల కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘జిగర్తాండా డబుల్ఎక్స్’. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను తెరకెక్కించారు. 2014లో వచ్చిన ‘జిగర్తాండా’కు సీక్వెల్‌గా ‘జిగర్తాండా డబుల్ఎక్స్’ తెరకెక్కింది. ఈ సినిమా ఫస్ట్ రివ్యూని పాన్ ఇండియా హీరో ధనుష్ ఇచ్చారు. ఈ రివ్యూలో సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అన్ స్టాపబుల్ సర్​ప్రైజ్ 


నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో ఓ సర్​ప్రైజ్ ఎపిసోడ్ ఉండబోతోందట. ఇటీవలే మొదలైన సీజన్ 3 లో ఓ బాలీవుడ్ హీరో తన మూవీ టీంతో సందడి చేయబోతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ బాలీవుడ్ హీరో ఎవరు? ఆ సర్​ప్రైజ్ ఎపిసోడ్ ఎప్పుడు? అనే వివరాల్లోకి వెళితే.. ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్టుగా 'అన్ స్టాపబుల్ టాక్ షో ఇప్పటికే రెండు సీజన్స్ ని సక్సెస్​ఫుల్​గా పూర్తి చేసుకుంది. సెలబ్రెటీలతో బాలయ్య చేసే సందడికి ఫ్యాన్స్​తో పాటు ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి అగ్ర హీరోలు సైతం బాలయ్య షోకి రావడంతో అన్ స్టాపబుల్ షో కి భారీ క్రేజ్ వచ్చింది. ఇటీవల సీజన్ 3 మొదలైన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి