తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో ఉంచిన ఐదు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. దీనికి సంబంధించి చివరి విడత జాబితాను ప్రకటించింది. చార్మినార్ - ముజీబ్ షరీఫ్, తుంగతుర్రి (ఎస్సీ) - మందుల సామ్యూల్, పటాన్ చెరు - కట్టా శ్రీనివాస్ గౌడ్, మిర్యాల గూడ - బాతుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట్ - రామిరెడ్డి దామోదర్ రెడ్డిలను ఖరారు చేస్తూ జాబితా విడుదల చేశారు.
వీరిలో పటాన్ చెరు అభ్యర్థిని మార్చేశారు. పటాన్ చెరు నుంచి తొలుత నీలం మధును ఎంపిక చేయగా, అతనికి బీ ఫాం ఇవ్వలేదు. తాజాగా ఈ స్థానంలో కట్టా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయించారు. సూర్యాపేట నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపింది. ఇక్కడి నుంచి టీపీసీసీ నేత పటేల్ రమేశ్ రెడ్డి తొలి నుంచి గట్టి పట్టుదలతో వ్యవహరిస్తున్నా, అధిష్టానం దామోదర్ రెడ్డికే టికెట్ కేటాయించింది.
ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎస్సీ స్థానాన్ని మందుల శ్యామ్యూల్‌కు కేటాయించారు. 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసిన అద్దంకి దయాకర్ ఇక్కడ బాగా ఆశలు పెట్టుకున్నా, ఆయనకు దక్కలేదు.