నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో ఓ సర్​ప్రైజ్ ఎపిసోడ్ ఉండబోతోందట. ఇటీవలే మొదలైన సీజన్ 3 లో ఓ బాలీవుడ్ హీరో తన మూవీ టీంతో సందడి చేయబోతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ బాలీవుడ్ హీరో ఎవరు? ఆ సర్​ప్రైజ్ ఎపిసోడ్ ఎప్పుడు? అనే వివరాల్లోకి వెళితే.. ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్టుగా 'అన్ స్టాపబుల్ టాక్ షో ఇప్పటికే రెండు సీజన్స్ ని సక్సెస్​ఫుల్​గా పూర్తి చేసుకుంది. సెలబ్రెటీలతో బాలయ్య చేసే సందడికి ఫ్యాన్స్​తో పాటు ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి అగ్ర హీరోలు సైతం బాలయ్య షోకి రావడంతో అన్ స్టాపబుల్ షో కి భారీ క్రేజ్ వచ్చింది. ఇటీవల సీజన్ 3 మొదలైన విషయం తెలిసిందే.


సీజన్ 3 లో భాగంగా ఇప్పటికే బాలయ్య తన 'భగవంత్ కేసరి' మూవీ టీంతో సందడి చేశాడు. ఈసారి లిమిటెడ్ ఎడిషన్ పేరుతో స్పెషల్ గా మొదలైన సీజన్ 3 కి గెస్ట్ గా రణబీర్ కపూర్ రాబోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది. అతనితో పాటు నేషనల్ రష్మిక మందున్న, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా హాజరు కాబోతున్నారట. సందీప్ రెడ్డి తో రణబీర్ కపూర్ 'యానిమల్'(Animal) అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నేషనల్ రష్మిక మందన హీరోయిన్​గా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. డిసెంబర్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.


ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో కి గెస్ట్ లుగా రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే రణబీర్, సందీప్ రెడ్డి వంగ, రష్మిక స్పెషల్ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ మొదలుకానుందని చెబుతున్నారు. అంతేకాదు నవంబర్ లాస్ట్ వీక్ లో ఈ ఎపిసోడ్ 'ఆహా'లో ప్రసారం కానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతుంది. కాగా అన్ స్టాపబుల్ టాక్ షోకు గెస్ట్ గా హాజరు కాబోతున్న ఫస్ట్ బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ కావడం విశేషం. మరోవైపు 'యానిమల్' ప్రమోషన్స్ ని హిందీ తో పాటు తెలుగులోనూ భారీ ఎత్తున ప్లాన్ చేశారు మేకర్స్.


ముఖ్యంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రణ్​బీర్​తో తెలుగులో కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక 'యానిమల్' విషయానికొస్తే.. తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండబోతోంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో రణబీర్ కపూర్ ని ఊర మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయబోతున్నాడు. సినిమాలో రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ హీరో బాబి డియోల్ విలన్ గా కనిపించనున్నాడు. సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీని తొలుత ఆగస్టు నెలలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవడంతో వాయిదా వేశారు. డిసెంబర్ 1న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.


Also Read : దుమ్ములేపిన 'దమ్ మసాలా' సాంగ్ - ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన 'గుంటూరు కారం' ఫస్ట్ సింగిల్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial