Prabhas Salaar Telugu Trailer Release On December 1st : రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్! 'సలార్' ట్రైలర్ విడుదలకు ముహూర్తం కుదిరింది. మరో 22 రోజుల్లో ప్రేక్షకుల ముందు డైనోసార్ యాక్షన్ ఎలా ఉంటుందో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చూడొచ్చు.
డిసెంబర్ 1న 'సలార్' ట్రైలర్
అవును... డిసెంబర్ 1న 'సలార్' ట్రైలర్ విడుదల కానుందని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సినిమా సన్నిహిత వర్గాలు సైతం అది నిజమేనని చెబుతున్నాయి. ఇప్పటి వరకు సినిమా నుంచి స్టిల్స్, చిన్న వీడియో గ్లింప్స్ మాత్రమే విడుదల చేశారు. ట్రైలర్ వస్తే... డైనోసార్ లాంటి పవర్ ఫుల్ పాత్రలో ప్రభాస్ యాక్షన్ ఎలా ఉంటుందో చూడవచ్చని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
Also Read : తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ దీపావళి - టాలీవుడ్ స్టార్ సినిమా ఒక్కటీ లేదుగా!
'యానిమల్'తో పాటు థియేటర్లలో ప్లే చేస్తారా?
Salaar trailer to play in Animal movie theaters : రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' సినిమా డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల అవుతోంది. ఆ సినిమాతో పాటు ఇంటర్వెల్ సమయంలో 'సలార్' ట్రైలర్ విడుదల చేసే ఛాన్స్ ఉందని బాలీవుడ్ టాక్.
Also Read : 'గేమ్ ఛేంజర్'కు భారీ డీల్ - విడుదలకు ముందు కోట్లు కొల్లగొట్టిన సాంగ్స్!
షారుఖ్ 'డంకీ' పోటీ వల్ల 'సలార్'పై ఎఫెక్ట్!?
డిసెంబర్ 22న 'సలార్' సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రభాస్ కంటే ముందు ఆ విడుదల తేదీపై బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కర్చీఫ్ వేశారు. ఆయన హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన హిందీ సినిమా 'డంకీ' డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు. దాంతో రెండు సినిమాల మధ్య పోటీ తప్పడం లేదు. హిందీ మార్కెట్ పరంగా షారుఖ్ సినిమాతో పోటీ అంటే వసూళ్ల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంచనా. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ రేట్లు తగ్గించమని అడుగుతున్నారట.
ప్రభాస్ 'సలార్' డిసెంబర్ 22కు రావడంతో... క్రిస్మస్ పండక్కి రావాలని ముందుగా అనుకున్న వెంకటేష్ 'సైంధవ్' సంక్రాంతికి జనవరి 13కి వెళ్ళింది. నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' డిసెంబర్ 8కి వస్తున్నట్లు వెల్లడించింది. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'హాయ్ నాన్న' డిసెంబర్ 7కి వచ్చింది.
'సలార్' సినిమాలో ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారు. జర్నలిస్ట్ ఆద్య పాత్రను ఆమె పోషిస్తున్నారు. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు. వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.