గ్లోబల్ లీడర్ అయ్యేందుకు 5 వ్యూహాలు


మన దేశం ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉండాలని కోరుకోవడం తన బాధ్యత అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ వైఖరి ప్రతి ఒక్కరిపైనా ఉండాలని అన్నారు. అందులో తెలుగు జాతి ఎప్పుడూ ముందు వరసలో ఉండాలని ఆకాంక్షించారు. అందులో భాగంగానే విజన్ 2047ను తీసుకొచ్చానని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు విశాఖపట్నం పాదయాత్రలో భాగంగా ‘ఇండియా ఇండియన్స్ తెలుగూస్ విజన్ 2047’ పేరుతో ప్రణాళికను ఆవిష్కరించారు. ఇంకా చదవండి


కళతప్పిన గవర్నర్ ‘ఎట్ హోం’


ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించడం, దానికి ముఖ్యమంత్రి సహా విపక్షాలకు చెందిన రాజకీయ నేతలు హాజరు అయ్యే సాంప్రదాయం ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. నేడు కూడా ఆగస్టు 15 సందర్భంగా గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ తేనీటి విందుకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. అధికార పార్టీకి చెందిన రాజకీయ నేతలు కూడా హాజరు కాలేదు. ఇంకా చదవండి


పంద్రాగస్టు సందేశంలో పొలిటికల్ ప్రచారం- మరో ఛాన్స్ అంటున్న మోదీ, కేసీఆర్, జగన్!


స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజకీయాలకు అతీతంగా జరగాలని దేశ ప్రజలు కోరుకుంటారు. కానీ అప్పటి రాజకీయాలకు, ఇప్పటి పాలిటిక్స్ కు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రభుత్వ పెద్దలు, ప్రతిపక్ష నేతలు సైతం పాలిటికల్ కామెంట్స్ చేయడానికి ఇండిపెండెన్స్ డే వేదికగా మారుతోంది. నేడు దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనం గా నిర్వహించుకుంటున్నాం. ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఏపీ, తెలంగాణలో త్రివర్ణ పతాకం ఎగురవేసిన వైఎస్ జగన్, కేసీఆర్ లు పంద్రాగస్టు సందేశం- పొలిటికల్ ప్రచారంగా కనిపిస్తోంది. ఇంకా చదవండి


రాజ్ భవన్‌లో ‘ఎట్ హోం’, సతీ సమేతంగా హాజరైన సీఎం జగన్


విజయవాడలోని రాజ్ భవన్‌లో మంగళవారం 'ఎట్ హోం' కార్యక్రమం నిర్వహించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చారు. ఈ అధికారిక కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. ఏపీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాక జస్టిస్ అబ్దుల్ నజీర్ తొలిసారిగా 'ఎట్ హోం' కార్యక్రమం నిర్వహించారు. ఇంకా చదవండి


తక్కెడ చేతపట్టిన మంత్రి హరీశ్ రావు


తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కాసేపు కూరగాయలు అమ్మారు. రైతు బజారులో కూరగాయలు అమ్ముతున్న రైతులతో కలసి మెలిసి మార్కెట్ మొత్తం తిరుగుతూ వారితో ముచ్చటించారు. వారి సమస్యలనే కాకుండా, ఇంకా ఏం కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలోనే మంత్రి కూరగాయలు తక్కెడ పట్టుకొని కూరగాయలు అమ్మారు. అది చూసి వినియోగదారులు కూడా ఆశ్చర్యానికి లోనైయ్యారు. ఇంకా చదవండి


గిల్లితే గిల్లిచ్చుకునే రకం కాదు! వచ్చే ఎన్నికల్లో పోటీపై బాలినేని క్లారిటీ


'బ్రో' సినిమా విడుదల తర్వాత ఎందుకో పోకిరి సినిమాలో 'గిల్లితే గిల్లిచ్చుకోవాలి'.. అనే డైలాగ్ ఏపీ రాజకీయాల్లో బాగా పాపులర్ అయింది. తనను దొంగచాటుగా గిల్లాలని మంత్రి అంబటి, గిల్లితే ఎవరూ గిల్లిచ్చుకోరు, తిరిగి గిల్లుతారంటూ మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు పేల్చారు. ఇప్పుడు వైసీపీకే చెందిన మరో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కూడా పరోక్షంగా అదే డైలాగ్ కొట్టారు. ఇంతకుముందు తనపై కొందరు కుట్రలు చేశారు, తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ.. వైవీ సుబ్బారెడ్డిని టార్గెట్ చేసిన బాలినేని, మరోసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన టాపిక్ తెరపైకి తెచ్చారు. ఒంగోలు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో పోటీని ప్రస్తావించారు. ఇంకా చదవండి


ఇండిపెండెన్స్ డే స్పెషల్: సేనాపతి లుక్‌లో కమల్ హాసన్ సర్‌ప్రైజ్


'విక్రమ్' సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఇండియన్ 2'. స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు కమల్ బర్త్ డే స్పెషల్ గా వచ్చిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సరికొత్త పోస్టర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. ఇంకా చదవండి


పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డిపై కేసు నమోదు- చిక్కుల్లో టీపీసీసీ చీఫ్


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ అసోసియేషన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాలతో నాగర్ కర్నూల్ పీఎస్ లో రేవంత్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ పై 153, 504, 506, 504 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై మొత్తం 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇంకా చదవండి


మందగమనంలో క్రిప్టో మార్కెట్లు - BTC ఎక్కడిదక్కడే!


క్రిప్టో మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.14 శాతం పెరిగి రూ.24.42 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.47.58 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 0.10 శాతం తగ్గి రూ.1,53,213 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.18.42 లక్షల కోట్లుగా ఉంది. ఇంకా చదవండి


భారత ఫుట్ బాల్ లెజెండ్ మహ్మద్ ​హబీబ్ కన్నుమూత


ఇండియన్ ఫుట్​బాల్ లెజెండ్ మహ్మద్​ హబీబ్ కన్నుమూశారు. హైదరాబాద్​కు చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ హబీబ్ వయసు 74. కాగా, కొన్నేళ్ల నుంచి ఆయన డిమెన్షియా అండ్ పార్కిన్​సన్స్ సిండ్రోమ్ సహా వయసురీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో హైదరాబాదీ, భారత్ ఫుట్ బాట్ ప్లేయర్ మహ్మద్​హబీబ్ కన్నుమూయడంతో క్రీడా రంగంలో విషాదం నెలకొంది. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇంకా చదవండి