Mohammad Habib Death News: ఇండియన్ ఫుట్​బాల్ లెజెండ్ మహ్మద్​ హబీబ్ కన్నుమూశారు. హైదరాబాద్​కు చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ హబీబ్ వయసు 74. కాగా, కొన్నేళ్ల నుంచి ఆయన డిమెన్షియా అండ్ పార్కిన్​సన్స్ సిండ్రోమ్ సహా వయసురీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో హైదరాబాదీ, భారత్ ఫుట్ బాట్ ప్లేయర్ మహ్మద్​హబీబ్ కన్నుమూయడంతో క్రీడా రంగంలో విషాదం నెలకొంది. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.


ఆసియా గేమ్స్​లో కాంస్యం నెగ్గిన దిగ్గజ ఆటగాడు 
మహ్మద్​హబీబ్ 1949 జులై 17న హైదరాబాద్​లో జన్మించారు. 1970లో థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్​వేదికగా జరిగిన ఆసియా గేమ్స్​లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో సభ్యుడు ఆయన.  హైదరాబాద్ కు చెందిన మరో ప్లేయర్​సయ్యద్​నయీముద్దీన్ ఆ మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరించారు. ఫుట్​బాల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత కోచ్​గా వ్యవహరించారు. 


మహ్మద్​హబీబ్ 1965 నుంచి 76 మధ్య కాలంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించారు. ఆయన బెస్ట్ ప్లేయర్ మాత్రమే కాదు ఎంతో మంది అటగాళ్లను సైతం తీర్చిదిద్దిన కోచ్ గా పేరుంది. 1977లో మోహన్ బగాన్ కోసం కాస్మోస్ క్లబ్‌కు ప్రత్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ లో లెజెండరీ పీలే కూడా పాల్గొనడం హబీబ్ కెరీర్ లో అద్భుతక్షణాల్లో ఒకటని చెప్పవచ్చు. ఒకసారి హబీబ్ స్పోర్ట్‌స్టార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ ముగిసే సమయంలో లెజెండ్ పీలే తనను కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలిపారని గుర్తుచేసుకున్నారు. తన కెరీర్ లో అదొక గొప్ప క్షణమని అభివర్ణించారు. 






సంవత్సరాలుగా అనేక సంభాషణల సమయంలో, హబీబ్ 1971లో తాను చేరిన మహమ్మదీయ స్పోర్టింగ్ యొక్క జెర్సీని ధరించడం చాలా గర్వంగా ఉందని నాకు గుర్తుచేసుకోవడంలో ఎప్పుడూ గర్వంగా ఉండేది. జట్టులో కీలక ఆటగాళ్లలో హబీబ్ ఒకరని భారత మాజీ కెప్టెన్, హైదరాబాదీ విక్టర్ అమల్‌రాజ్ తరచుగా చెబుతుండేవారు. ఆటపట్ల చిత్తశుద్ధి, గేమ్ స్కిల్స్ తో టాటా ఫుట్‌బాల్ అకాడమీని గొప్పగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు.


తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అలీ రఫత్, సెక్రటరీ జి. పాల్గుణ, టీఎఫ్ఏ చైర్మన్, శ్రీనిది ఎఫ్‌సి ఓనర్ డాక్టర్ కె.టి. మహి, హైదరాబాద్ ఫుట్ బాల్ క్లబ్ ఓనర్ వరుణ్ త్రిపురనేని దిగ్గజ ఆటగాడి మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. భారత జట్టుకు ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. కోచింగ్ లో దేశానికి, పలు రాష్ట్రాలకు మెరుగైన ఆటగాళ్లను అందించారు హబీబ్ అని గుర్తుచేసుకున్నారు.