ఏసీబీ కోర్టులో చంద్రబాబు, వాదనలు వింటున్న జడ్జి - బెయిల్‌పై ఉత్కంఠ!


విజయవాడ కోర్టులో చంద్రబాబును సీఐడీ అధికారులు హాజరు పరిచారు. చంద్రబాబు తరఫున సీనియర్ సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ తరపున ఏఏజీ పి.సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఇరు పక్షాల వాదనల తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుదన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఇంకా చదవండి


ప్రజల్లోకి భువనేశ్వరి, బ్రాహ్మణి - టీడీపీ అన్ని అవకాశాల్నీ ఉపయోగించుకోబోతోందా?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఊహించనంతగా మారిపోతున్నాయి. సాధారణంగా  ప్రతిపక్ష నేతల అరెస్టులు, వారిపై కక్ష సాధిస్తున్నారని ప్రజలు అనుకునే వ్యవహారాలను ఎన్నికలకు ఏడాది ముంద ప్రభుత్వాలు చేయవు. తప్పని సరిగా అరెస్టులు లాంటివి చేయాల్సి వచ్చినా .. వారిపై ఉన్న అభియోగాలు, ఆధారాలు అన్నింటినీ ప్రజల్లోకి పెట్టి వీలైనంతగా చర్చ పెట్టి అప్పుడు అరెస్ట్ చేస్తారు. వేధిస్తున్నట్లుగా అరెస్ట్ చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇలాంటి పరిస్థితులు తమకు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో రాజకీయ పార్టీలకు ఓ పక్కా ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు టీడీపీ.. తమకు అలాంటి అవకాశం వచ్చినట్లుగా నిర్ణయానికి వచ్చామని ఇక ఉపయోగించుకోవాలని రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంకా చదవండి


చంద్రబాబు అరెస్ట్ పై తెలుగు రాష్ట్రాల్లో హడావుడి- స్పందించని జూ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్!


ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుంటే... జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రాం మాత్రం స్పందించలేదు. శనివారం వేకువజాము నుంచి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం నడుస్తుంటే.... ఎన్టీఆర్ మాట్లాడకపోవడంపై టీడీపీ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. సినిమా షూటింగ్ లేకపోయినా, చంద్రబాబు అరెస్టు విషయం తెలిసినా.... ఎందుకు స్పందించలేదన్నది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబుతో ఎన్టీఆర్ కు అంతగా ర్యాపో కనిపించదు. పైగా నందమూరి ఫ్యామిలీలో జరిగే కార్యక్రమాలకు ఎన్టీఆర్ అంతగా అటెండ్ కావడం లేదు. కుటుంబసభ్యులు ఆహ్వానాలు పంపినా... చాలా సందర్భాల్లో దూరంగా ఉంటున్నారు. ఒక వేళ వెళ్లినా, కార్యక్రమంలో అంటీఅంటనట్టుగా ఉంటారని టాక్. ఇంకా చదవండి


సభ జరిగితే బీఆర్‌ఎస్ పతనం ఖాయం, తెలంగాణ కోసం ఐదు గ్యారెంటీలు - రేవంత్ రెడ్డి


కాంగ్రెస్ సభ జరిగితే తెలంగాణలో బీఆర్‌ఎస్ పతనం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. విజయభేరి సభ జరుగనున్న ప్రాంతాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఈ నెల 17న విజయభేరి సభలో సోనియా గాంధీ 5 గ్యారంటీలను ప్రకటిస్తారని చెప్పారు. బీజేపీ, బీఆర్​ఎస్ కుట్ర చేసి విజయభేరీ సభకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు. విజయభేరీ సభ కోసం మొదట పరేడ్ గ్రౌండ్‌ కోసం డిఫెన్స్ అధికారులను అడిగినట్లు చెప్పారు. అయి కేంద్రం తరపున రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాయబారం నడిపారని, తమ ప్రతిష్ఠను కాపాడుకునేందుకు  బీజేపీ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇంకా చదవండి


లక్షన్నర మందితో పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌ ప్రారంభ సభ - మంత్రి కేటీఆర్


ప్రజలు కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌ అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీ రామారావు (Minister KT Rama Rao) అన్నారు. శనివారం స‌చివాల‌యంలో మ‌హ‌బూబ్‌న‌గర్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, వివిధ శాఖల అధిపతులు, పూర్వ జిల్లాల‌ కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ స‌మీక్ష నిర్వహించారు. ఈ నెల 16వ తేదీన జరగనున్న పాల‌మూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి చర్చించారు. కనీసం లక్షన్నర మంది రైతులతో ప్రారంభోత్సవ సభ ఉంటుందని చెప్పారు. ప్రాజెక్టు విశిష్టతను ప్రజలకు తెలియజేసేలా గొప్పగా సంబరాలు జరపాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇంకా చదవండి


జీ20 అతిథులకు రాష్ట్రపతి డిన్నర్ పార్టీ- ఏం వడ్డించారంటే !


జీ20 సదస్సులో (G20 Summit)లో పాల్గొనేందుకు దేశాధినేతలు, ఇతర అతిథులు దేశా రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. వారందరికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. సదస్సు ప్రధాన వేదిక ‘భారత్‌ మండపం’లో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో కలిసి రాష్ట్రపతి అతిథులకు స్వాగతం పలికారు.  విందులో భాగంగా ప్రపంచ అగ్రనేతలకు భారతీయ వంటకాలను రుచి చూపించనున్నారు. ఇంకా చదవండి


ఆనంద్ దేవరకొండ తరువాతి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ 


ఒక సినిమా హిట్ అయ్యిందంటే చాలు.. ఆ నటీనటులు చేస్తున్న తరువాతి సినిమా ఏంటి అని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఒకవేళ ఆ మూవీ బ్లాక్‌బస్టర్ అయితే.. ప్రేక్షకులు ఎదురుచూపులు ఒక రేంజ్‌లో ఉంటాయి. ఇక విజయ్ దేవరకొండ సోదరుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ.. కెరీర్ మొదటి నుండి ఫ్యామిలీ సినిమాలనే తెరకెక్కిస్తూ వచ్చాడు. ఒక్కసారిగా ఫ్యామిలీ జోనర్ నుండి యూత్‌ఫుల్ జోనర్‌కు షిఫ్ట్ అవుతూ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఈ మూవీ తర్వాత ఆనంద్.. ‘గం.. గం.. గణేశా’ అనే చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంకా చదవండి


అల్లు అర్జున్‌కు ‘మా’ లేఖ, 'అదొక్కటే బాధగా ఉంది' అంటున్న మంచు విష్ణు


ఇటీవల 69వ నేషనల్ అవార్డ్స్ ప్రకటన జరిగింది. నేషనల్ అవార్డ్స్ అనేవి ప్రారంభించి ఇప్పటికీ 69 సంవత్సరాలు అయినా ఇప్పటివరకు ఒక తెలుగు హీరోను కూడా ఆ అవార్డ్ వరించలేదు. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిన నేషనల్ అవార్డ్ జ్యూరీ.. తనకు ఆ అవార్డ్‌ను ప్రకటించింది. నేషనల్ అవార్డ్స్ ప్రకటన జరిగినప్పటి నుండి దాని చుట్టూ ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ అయినా.. అల్లు అర్జున్‌కు అందే ప్రశంసలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు నేరుగా వచ్చి అల్లు అర్జున్‌ను ప్రశంసించడంతో పాటు.. పలువురు లేఖలు కూడా పంపించారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నుండి కూడా అల్లు అర్జున్‌కు లేఖ అందింది. ఆ లేఖను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బన్నీ. ఇంకా చదవండి


రివెంజ్ తీరాలంటే రెయిన్ ఆగాలి - దాయాదుల మలి పోరులో వరుణుడే కీలకం


రెండేండ్లకో నాలుగేండ్లకో ఒకసారి  ఐసీసీ టోర్నీలలో తప్ప రెగ్యులర్‌గా తలపడని భారత్ - పాకిస్తాన్‌ల పోరు వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి జరుగుతోంది. ఆసియా కప్- 2023లో భాగంగా  చిరకాల ప్రత్యర్థులు గ్రూప్ దశలో ఒకసారి తలపడగా వర్షం కారణంగా ఆ మ్యాచ్ అర్థాంతరంగా రద్దు అయింది. సగం మజానే ఇచ్చిన ఆ పోరును  పూర్తిగా ఎంజాయ్ చేయడానికి  క్రికెట్ మరో అవకాశమిచ్చినా వరుణుడు మాత్రం  దానినీ జరగనిచ్చేట్టే లేడు.  ఇప్పుడు ఇరు దేశాల క్రికెట్ అభిమానులు  ఈ మ్యాచ్‌లో ఎవరు గెలవాలి..? అనేదానికంటే.. ‘వరుణదేవుడా.. ప్లీజ్.. ఒక్కరోజు కరుణించవయ్యా..’ అని వేడుకోవాల్సిన సమయం వచ్చింది. నేడు కొలంబోలో వర్షాలు పడే అవకాశం ఏకంగా 90 శాతం  ఉంది. ఇంకా చదవండి


త్వరలో ఐదు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు దించనున్న మహీంద్రా - లైనప్ మామూలుగా లేదుగా!


గత నెలలో మహీంద్రా & మహీంద్రా దాని స్కార్పియో, బొలెరో, థార్‌తో సహా ఇప్పటికే ఉన్న అనేక కార్ల ఎలక్ట్రిక్ వెర్షన్‌లను తీసుకురావాలని ప్రణాళికలను వెల్లడించింది. దీనితో పాటు, ఎక్స్‌యూవీ.e (ఎక్స్‌యూవీ.e8, ఎక్స్‌యూవీ.e9), BE (BE.05BE.07BE.09) అనే రెండు వేర్వేరు బ్రాండ్‌ల క్రింద కంపెనీ అనేక కొత్త ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు వాటి కాన్సెప్ట్ రూపంలో కనిపించాయి. మహీంద్రా తన ఎక్స్‌యూవీ.e8 ను ముందుగా మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ కారు మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎలక్ట్రిక్ మోడల్‌గా ఉంటుంది. ఇంకా చదవండి