Minister KTR: ప్రజలు కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌ అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీ రామారావు (Minister KT Rama Rao) అన్నారు. శనివారం స‌చివాల‌యంలో మ‌హ‌బూబ్‌న‌గర్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, వివిధ శాఖల అధిపతులు, పూర్వ జిల్లాల‌ కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ స‌మీక్ష నిర్వహించారు. ఈ నెల 16వ తేదీన జరగనున్న పాల‌మూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి చర్చించారు. కనీసం లక్షన్నర మంది రైతులతో ప్రారంభోత్సవ సభ ఉంటుందని చెప్పారు. ప్రాజెక్టు విశిష్టతను ప్రజలకు తెలియజేసేలా గొప్పగా సంబరాలు జరపాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.


ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వలసల‌తో ఒకప్పుడు పడావుపడ్డ పాలమూరు జిల్లాను పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం పచ్చగా చేస్తుంద‌ని పేర్కొన్నారు. ప్రతి ఏటా లక్షల మంది పాలమూరు ప్రజలు వలస పోయే పరిస్థితి ఉండేదని, నేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామ‌ని తెలిపారు. ఈ నెల 16న ప్రారంభించబోయే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో.. రైతన్నలకు సాగునీటి కష్టాలు తొలిగిపోనున్నాయన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు(PRLI Project) ప్రారంభోత్సవం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పాలమూరుతో పాటు రంగారెడ్డి జిల్లా భూములకు సైతం నీళ్లు అందిస్తామ‌న్నారు. 


గోదావరి బేసిన్‌లో కాళేశ్వరం, కృష్ణా బేసిన్‌లో పాలమూరు-రంగారెడ్డి లాంటి గొప్ప ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కట్టింద‌ని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టు విశిష్టతను తెలిపేలా గొప్పగా సంబరాలు చేసుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.  సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయితే తెలంగాణ సాగునీటి రంగంలో ప్రాజెక్టులు సంతృప్త స్థాయిలో పూర్తి అవుతాయన్నారు. 


ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌ ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న గొప్ప ప్రాజెక్టు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌ అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కట్టిన ప్రాజెక్టులను చూస్తుంటే.. కేవలం తెలంగాణ బిడ్డగానే కాకుండా భారతదేశ పౌరుడిగా కూడా గర్వంగా ఉంద‌న్నారు.  ప్రాజెక్టుల నిర్మాణం వెనుక 2001 నుంచి తెలంగాణ ప్రజలు కన్న కలలు ఉన్నాయని తెలిపారు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు.. ప్రజల కష్టాలను తీర్చనుందన్నారు.


పాల‌మూరు ఎత్తిపోత‌ల అనేక అడ్డంకులను దాటుకుని కేసీఆర్ పట్టుదలతో పూర్తయిన ప్రాజెక్టుపాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌ అని మంత్రి తెలిపారు. రైతుల పొలాలకు సాగునీటితో పాటు, రాజధాని ప్రజల తాగునీటి అవసరాలు, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాను కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుంద‌ని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చ‌రిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంద‌న్నారు. ఉమ్మడి పాలనలో తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొన్న పాలమూరు వాసుల నీటికష్టాలు తీరనున్నాయని 16వ తేదీన ప్రారంభించే ప్రాజెక్టుతో నూతన శోభ రాబోతుందని పేర్కొన్నారు. ఈ శుభ సందర్భాన్ని గొప్పగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కనీసం లక్షన్నర మంది రైతులతో ప్రారంభోత్సవ సభ ఉంటుందని చెప్పారు. ప్రాజెక్టు విశిష్టతను ప్రజలకు తెలియజేసేలా గొప్పగా సంబరాలు చేసుకోవాలని సూచించారు.