G20 Summit 2023: ఢిల్లీ డిక్లరేషన్‌ని ఆమోదించిన G20 నేతలు, ప్రధాని మోదీ కీలక ప్రకటన

G20 Summit 2023: G20 ఢిల్లీ డిక్లరేషన్‌పై అందరు సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు ప్రధాని మోదీ ప్రకటించారు.

Continues below advertisement

G20 Summit 2023: 

Continues below advertisement

ఢిల్లీ డిక్లరేషన్‌కి ఆమోదం..

తొలిరోజు G20 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ డిక్లరేషన్‌కి (Delhi Declaration) సభ్యులందరూ ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కొంత వరకూ భేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ చివరకు అంతా ఏకాభిప్రాయంతో డిక్లరేషన్‌ని స్వాగతించినట్టు స్పష్టం చేశారు. ఇదంతా సమష్టి కృషి వల్లే సాధ్యమైందని ప్రధాని తెలిపారు. 

"ఇప్పుడే నేనో శుభవార్త విన్నాను. మా టీమ్ కృషి వల్ల న్యూ ఢిల్లీ డిక్లరేషన్‌ విషయంలో అందరు నేతలూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ డిక్లరేషన్‌కి ఆమోదం తెలపాలని నేను ప్రతిపాదించాను. అందరూ అందుకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా G20 షెర్పాలు, మంత్రులతో పాటు ఇది సాధ్యమయ్యేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను"

- ప్రధాని నరేంద్ర మోదీ 

 

Continues below advertisement
Sponsored Links by Taboola