G20 Summit 2023: 


చిదంబరం ఫైర్..


G20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథులందరికీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపారు. కానీ...కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి మాత్రం ఈ ఆహ్వానం అందలేదు. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండి పడుతున్నారు. కొందరైతే "కుల రాజకీయాలు" అంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం స్పందించారు. ఖర్గేని ఆహ్వానించకపోవడంపై మండి పడ్డారు. ప్రజాస్వామ్యం,ప్రతిపక్షం లేని దేశాల్లో తప్ప ఇలా ఎక్కడా జరగదని విమర్శించారు. ఇంకా భారత్‌ ఇలాంటి దశకు చేరుకోలేదనే అనుకుంటున్నాని అసహనం వ్యక్తం చేశారు చిదంబరం. ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"ప్రధాన ప్రతిపక్ష నేతను రాష్ట్రపతి విందుకి ఆహ్వానించకపోవడం బహుశా మరే దేశంలోనూ జరగదేమో. ప్రతిపక్షం, ప్రజాస్వామ్యం లేని దేశాల్లోనే ఇలా జరుగుతుంది. ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనే స్థాయికి భారత్ ఇంకా దిగజారిపోలేదనే అనుకుంటున్నాను"


- పి చిదంబర్, కాంగ్రెస్ ఎంపీ 






అంతకు ముందు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఖర్గేకి ఆహ్వానం అందకపోవడంపై స్పందించారు. ప్రతిపక్ష నేతలంటే ప్రధాని మోదీకి ఏ మాత్రం లక్ష్యం లేదని మండి పడ్డారు. ఈ వివాదంపై స్వయంగా ఖర్గే కూడా స్పందించారు. ఇప్పటికే పార్టీ తరపున చాలా మంది ఈ విషయంపై మాట్లాడారని, ఇలాంటి రాజకీయాలు పనికి రావని విమర్శించారు. 


"నేను ఇప్పటికే ఈ వివాదంపై స్పందించాను. మా పార్టీ నేతలు కూడా స్పందిస్తున్నారు. బీజేపీ మరీ ఇంత దిగజారిపోవడం సరికాదు. ఇలాంటి రాజకీయాలు అసలు సరికావు"


- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు