ఇండియా పేరు మార్పుపై పరోక్షంగా ప్రధాని మోదీ క్లారిటీ, G20 సదస్సులో నేమ్‌ప్లేట్‌పై 'భారత్'

India Bharat Name Change Row: G20 సదస్సులో ప్రధాని మోదీ కూర్చున్న చోట నేమ్‌ ప్లేట్‌పై భారత్ అని రాసుండడం ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

India Bharat Name Change Row:

Continues below advertisement

ప్రధాని నరేంద్ర మోదీ G20 సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మొరాకోలో భూకంప విపత్తులో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గాయపడ్డవాళ్లు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఈ కష్టకాలంలో మొరాకో దేశానికి ఎలాంటి సాయమైనా అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. మోదీ కూర్చున్న స్థానంలో ముందు నేమ్‌ప్లేట్‌ ఆసక్తికరంగా మారింది. దానిపై India కి బదులుగా Bharat అని రాసుంది. పేరు మార్పుపై ఇప్పటికే చర్చ జరుగుతుండగా ప్రధాని మోదీ నేమ్‌ప్లేట్‌పై ఆ పేరు కనిపించింది. విపక్షాలు దీనిపై ఎన్నో విమర్శలు చేస్తున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మండి పడుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో భారత్ అని కనిపించడం వల్ల కేంద్రం అందుకు సిద్ధంగానే ఉందని సంకేతాలిచ్చినట్టైంది. 

Continues below advertisement