Weekly Horoscope 11 To 17 September 2023


మేష రాశి


ఈ రాశివారికి ఈ వారం శుభఫలితాలున్నాయి. ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. మీ శత్రువులు యాక్టివ్ గా ఉంటారు కానీ మీరు అప్రమత్తంగా వ్యవహరిస్తారు. మీ మేధస్సుని తక్కువ అంచనా వేసుకోవద్దు.  ఆరోగ్యం విషయంలో మిశ్రమఫలితాలున్నాయి. నూతన ఆస్తి కొనుగోలు చేసేందుకు ఆలోచన చేస్తారు. కమ్యూనికేషన్ రంగంలో ఉండేవారు గౌరవం పొందుతారు. ఈవారం ఆర్థికంగా లాభపడే అవకాశాలున్నాయి. బంధువులను కలుస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. మీ ప్రణాళికలను కార్యరూపం దాల్చేలా ప్లాన్ చేసుకోండి. ఈ వారం మీ అదృష్ట రంగు ఊదా, అదృష్ట సంఖ్య 2, కలిసొచ్చే రోజు ఆదివారం. 


వృషభ రాశి


ఈ వారం వృషభరాశికి చెందిన రాజకీయనాయకులకు శుభసమయం. దేశ, విదేశాల్లో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. ఈ వారం ప్రారంభంలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఉద్యోగులకు సాధారణ ఫలితాలున్నాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తోడబుట్టినవారితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.  ఈ వారం మీకు అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1, అదృష్ట రోజు గురువారం .


మిథున రాశి


ఈ వారం మిథున రాశి వారు  కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడంలో విజయం సాధిస్తారు. మీరు మీ ప్రయత్నాలు శ్రద్ధగా చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు.ఈ రాశి ఉద్యోగులుకు కార్యాలయంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులు లాభపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వారాంతంలో గ్రహసంచారం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ, వ్యక్తిగత జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు.  మీ శత్రువులు మీకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త. ఈ్ వారం మీ అదృష్ట రంగు స్కై బ్లూ, అదృష్ట రోజు శనివారం


కర్కాటక రాశి


ఈ వారం కర్కాటక రాశి వారు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వైవాహిక జీవితం అద్భుతంగా సాగేందుకు చేసే ప్రయత్నాల వల్ల మంచి ఫలితం ఉంటుంది.  ఇంట్లో సంతోషం పెరుగుతుంది. వారం మధ్యలో  భూమి, భవన నిర్మాణ విషయాలపై నిర్ణయం తీసుకుంటారు. గ్రహసంచారం వారం ఆరంభంలో కన్నా వారాంతంలో మంచి ఫలితాలు ఇస్తుంది.  వ్యాపారంలో  అడ్డంకులను అధిగమించడంలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో మంచి సమన్వయం ఉంటుంది. చిన్న చిన్న సవాళ్లకు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి  ఈ వారం మీ అదృష్ట రంగు నీలం, అదృష్ట సంఖ్య 7, అదృష్ట రోజు శుక్రవారం . 


Also Read: 'నాస్తికో వేదనిందకః'- కలియుగంలో ఇంతేనా, సనాతనధర్మంపై వివాదం ఈ కోవకే చెందుతుందా!


సింహ రాశి  


సింహరాశికి చెందిన కళా, పారిశ్రామిక రంగాల వారికి ఈ వారం అద్భుతమైన సమయం. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. వారం ఆరంభంలో గ్రహ సంచారం అంత అనుకూలించదు.  ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. నూతన గృహం కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి. వైవాహిక జీవితం బావుంటుంది. తలపెట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు.  కాస్త ఓపికగా వ్యవహరించండి. తొందరపాటు తగ్గించుకోవడం మంచిది. ఈ వారం మీ అదృష్ట రంగు గోధుమ రంగు, అదృష్ట సంఖ్య 2, అదృష్ట రోజు శుక్రవారం. 


కన్యా రాశి


అధ్యయన రంగంలో ఉండేవారికి ఈ వారం అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. కళారంగంలో ఉండేవారు ధైర్యంగా అడుగువేయండి. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.  ఈ వారం మధ్యలో కొన్ని పనులపై దూరప్రాంత ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదు. మానసికంగా దృఢంగా ఉండండి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మీ ఈ వారం అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5, అదృష్ట దినం మంగళవారం 


తులా రాశి


మేనేజ్‌మెంట్, బోధన రంగాల్లో ఉన్నవారికి  ప్రమోషన్‌కు అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినా అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు పెద్దగా కలసి రావు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు పాటించడం ఉత్తమం.  జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి..నమ్మకంతో ముందుకు సాగండి.  వారాంతంలో ఆరోగ్యం సరిగా ఉండదు.  ఈ వారం మీ అదృష్ట రంగు ఆరెంజ్, అదృష్ట సంఖ్య 8, అదృష్ట రోజు శుక్రవారం 


వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారికి ప్రణాళికల అమలులో ఈ వారం చాలా ముఖ్యమైనది. అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ వారం నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. గ్రహసంచారం అనుకూల ఫలితానిస్తుంది.  పిల్లల మొండితనం కారణంగా కొంత ఇబ్బంది పడతారు. ఈ వారాంతంలో ఏదైనా కొత్తపని ప్రారంభించినా ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఈ వారం మీ అదృష్ట రంగు బంగారు/పసుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట రోజు గురువారం. 


Also Read: శివుడికి పంచారామ క్షేత్రాల్లా గణేషుడికి అష్టవినాయక ఆలయాలు, వీటి విశిష్టత ఏంటంటే!


ధనస్సు రాశి


ఈ రాశివారు ఈ వారం పెట్టే పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలు పక్కనపెడితే కచ్చితంగా లాభపడే పరిస్థితి ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు పక్కనపెడితే అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ వారం గ్రహ సంచారం ప్రైవేట్ , ప్రభుత్వ రంగాలవారికి  గడిచిన వారంకన్నా ఈ వారం బాగానే ఉంటుంది. మీ తెలివిని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోండి. ఈ వారం మీ అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2, కలిసొచ్చే రోజు ఆదివారం . 


మకర రాశి


ఈ వారం ఈ రాశికి చెందిన ప్రైవేట్ రంగమైనా లేదా ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికైనా ఆశించిన  ఫలితాలు ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు సాధిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వారం ఆరంభం కన్నా ద్వితీయార్థం కలిసొస్తుంది. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఒత్తిడి ఉన్నప్పటికీ, మీ బాధ్యతలను చక్కగా పూర్తి చేయండి. ఈ వారం మీ అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4, అదృష్ట దినం శుక్రవారం మరియు వారం చిట్కా - , ప్రొఫైల్, మీపై దృష్టి పెట్టాలి


కుంభ రాశి


ఈ వారం కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేసే ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలనిస్తాయి. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారం బాగానే సాగుతుంది. బంధువులను కలుస్తారు. ఇన్‌ఫర్మేషన్ ,కమ్యూనికేషన్, ఎనర్జీ, కన్‌స్ట్రక్షన్ తదితర రంగాల్లో ఇన్వెస్టర్లకి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రేమ సంబంధాలలో సామరస్యం ఉంటుంది.  ఖర్చులు నియంత్రించేందుకు ప్రయత్నించాలి.ఈ వారం మీ అదృష్ట రంగు గోధుమ/ఎరుపు, అదృష్ట సంఖ్య 2, అదృష్ట దినం బుధవారం 


మీన రాశి


ఈ వారం ఈ రాశికి చెందిన సినీ, కళలు,సంగీత రంగాల్లో ఉండేవారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. గ్రహసంచారం మీకు పూర్తి అనుకూల ఫలితాలనిస్తోంది. క్రీడల్లో ఉండేవారికి విజయ అవకాశాలున్నాయి. ప్రేమసంబంధాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మరిన్ని ప్రయత్నాలు చేస్తారు. ప్రత్యేక బంధువులను కలిసేందుకు వెళతారు. వారాంతంలో పని ఒత్తిడి పెరుగుతుంది.  వైవాహిక జీవితంలో కొనసాగుతున్న విభేదాలకు ముగింపు లభిస్తుంది. మీ బలాన్ని గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఈ వారం మీ అదృష్ట రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3, అదృష్ట రోజు శుక్రవారం


గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.