News
News
X

Dalai Lama Birthday: హాలీవుడ్ యాక్టర్‌తో కలిసి కేక్ కట్ చేసిన దలైలామా, ట్విటర్‌లో ప్రముఖుల శుభాకాంక్షలు

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దలైలామా 87వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పలువురు ప్రముఖులు ట్విటర్ వేదికగా విషెస్ చెప్పారు.

FOLLOW US: 

టిబెటియన్ ఆధ్యాత్మిక వేత్త దలైలామా 87వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 14వ దలైలామాను టెంజిన్ గ్యాస్టోగానూ పిలుస్తారు. అహింసకు, కరుణకు ఆయనను ప్రతీకగా భావిస్తారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్‌లో దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని 
ఆకాంక్షించారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా దలైలామాకు ట్విటర్‌లో విషెస్ చెప్పారు. హాలీవుడ్ యాక్టర్ రిచర్డ్ గీర్ ధర్మశాలలో నిర్వహించిన దలైలామా జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. దలైలామాతో కలిసి కేక్ కట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు. 

దలైలామా జీవిత విశేషాలు: 


టిబెట్‌లోని అమ్‌డో ప్రావిన్స్‌లో 1935, జులై 6వ తేదీన జన్మించారు దలైలామా. ఆయనకు లామో థాండప్‌ అనే పేరు పెట్టారు. కోరికలు తీర్చే దేవత అని దీనర్థం. 1959లో చైనా ప్రభుత్వం అరాచకాలతో వేలాది మంది టిబెటియన్లు తమ ప్రాంతాన్నీ వీడాల్సి వచ్చింది. వారంతా భారత్‌కు వలస వచ్చారు. దలైలామా కూడా వారిలో ఉన్నారు. ముస్సోరి, ఉత్తరాఖండ్‌లో కొంతకాలం పాటు ఉన్నారు. 1960లో ధర్మశాలకు వెళ్లిపోయారు. ఆయనను అందరూ ఆధ్యాత్మికవేత్తగా పిలుస్తుంటే, చైనా మాత్రం "వేర్పాటువాది" అని ముద్ర వేసింది. "సన్‌ ఆఫ్ ఇండియా"గా అభివర్ణిస్తోంది. అంతకు ముందు వారితో పోల్చితే ఎక్కువ కాలం పాటు జీవించిన  దలైలామాగా ఆయన రికార్డు సృష్టించారు. 1989లో నోబుల్ శాంతి బహుమతిని అందుకున్నారు. 

 

Published at : 06 Jul 2022 04:54 PM (IST) Tags: tibet DalaiLama Dalailama Birthday Tibetan Spiritual Leader

సంబంధిత కథనాలు

Viral Video : కళ్ల ముందు భారీ కాలనాగు, బెదరక బిడ్డను రక్షించిన తల్లి

Viral Video : కళ్ల ముందు భారీ కాలనాగు, బెదరక బిడ్డను రక్షించిన తల్లి

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య

Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య

Noida Twin Towers : 40 అంతస్తుల బిల్డింగ్ - క్షణాల్లో నేల మట్టం ! నోయిడా ట్విన్ టవర్స్‌ను ఎలా కూల్చబోతున్నారో తెలుసా ?

Noida Twin Towers :   40 అంతస్తుల బిల్డింగ్ - క్షణాల్లో నేల మట్టం ! నోయిడా ట్విన్ టవర్స్‌ను ఎలా కూల్చబోతున్నారో తెలుసా ?

AP Govt Employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఈహెచ్ఎస్ కార్డుతో వేరే రాష్ట్రాల్లో ట్రీట్మెంట్

AP Govt Employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఈహెచ్ఎస్ కార్డుతో వేరే రాష్ట్రాల్లో ట్రీట్మెంట్

టాప్ స్టోరీస్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Telangana TDP Votes :  టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?