అన్వేషించండి

Donald Trump: పేపర్ స్ట్రాలు బ్యాన్, ప్లాస్టిక్‌కు గ్రీన్ సిగ్నల్ - ట్రంప్ మావతో మామూలుగా ఉండదు

Paper Straws: ప్రపంచం అంతా పర్యావరణం గురించి భయపడి ప్లాస్టిన్ వినియోగాన్ని మానేయాలని అనుకుంటూంటే ట్రంప్ మాత్రం అది పిచ్చి పని అంటున్నారు. అంతే కాదు పేపర్ ఉత్పత్తుల్ని బ్యాన్ చేసి పడేశారు.

Donald Trump Bans Paper Straws Brings Back Plastic:  హింసించే రాజు ఇరవయ్యో పులకేశీ గురించి మనం ఇక్కడ సినిమాగా చూసి ఉంటారు కానీ అమెరికన్లు మాత్రం ట్రంప్ లో అలాంటి లక్షణాలు ఇప్పుడిప్పుడే చూస్తున్నారు. ఆయన ఇస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను చూసి చాలా మంది  బిక్కచచ్చిపోతున్నారు. తాజాగా ఆయన ఓ విచిత్రమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను పాస్ చేశారు. అదేమిటంటే పేపర్ స్ట్రాలను బ్యాన్ చేయడం. మీరు కరెక్ట్ గానే చదివారు. ప్రపంచం అంతా ప్లాస్టిక్ స్ట్రాలను బ్యాన్ చేస్తోంది. కానీ ట్రంప్ మాత్రం పేపర్ స్ట్రాలను బ్యాన్ చేశారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.               

బైడెన్ తన పాలనలో అమెరికాలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని దశలవారీగా తగ్గించేలా ఉత్తర్వులు ఇచ్చారు. అందులో భాగంగా ప్లాస్టిక్ స్ట్రాల బ్యాన్ ఇప్పటికే అమల్లోకి వచ్చింది. 2035 నాటికి అమెరికాలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉండకుండా ఆదేశాలు జారీ చేశారు. అయితే ట్రంప్ ఇప్పుడు ఆ ఆదేశాలన్నీ రద్దు చేశారు. రివర్స్ లో ఫెడరల్ కార్యాలయాల్లో ఎక్కడా పేపర్ స్ట్రాలు వాడాల్సిన పని లేదు.. ప్లాస్టిక్ స్ట్రాలు మాత్రమే వాడాలని ఆదేశాలు ఇచ్చారు. బయట ఎవరైనా పేపర్ స్ట్రాలు కొనుక్కుంటే వాళ్లిష్టం.              

ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చాలా మందికి అర్థం కాలేదు కానీ..  ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేస్తున్న సమయంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని వల్ల ఏమీ వర్కవుట్ కాదని.. ఈ పేపర్ స్ట్రాలు ఒక్కోసారి చినిగిపోతున్నాయని.. మరో సారి డ్రింక్స్ చిందేలా చేస్తున్నాయని .. తనకు చాలా సార్లు అనుభవమయిందన్నారు. అంటే తాగేటప్పుడు అసౌకర్యానికి గురి చేస్తున్నాయని ఆయన వీటిని బ్యాన్  చేసేసి ప్లాస్టిక్స్ కు అనుమతి ఇచ్చారు. ట్రంప్ ఇలాంటి రివర్స్ నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు. 

ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలన్నీ ప్లాస్టిక్ ను బ్యాన్ చేయాలని అనుకుంటున్నాయి. మన దేశంలో కూడా ఫ్రూటీ ప్యాకెట్లపై కూడా ఇప్పుడు పేపర్ స్ట్రాలే వస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఓ మాట మీద నిలబడి ప్లాస్టిక్ భూతం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ట్రంప్ మాత్రం తేడాగా వ్యవహరిస్తున్నారు. ఆయన తీరుతో ప్రపంచ పర్యావరణం మరోసారి ప్రమాదంలో పడే అవకాశం. ఏంటి ఒక్క ప్లాస్టిక్ స్ట్రాల వల్లేనా అనే డౌట్ రావాల్సిన పని లేదు..  ట్రంప్ ఒక్క పేపర్ స్ట్రాలకే దీన్ని పరిమితం చేయడం లేదు.. మొత్తం ప్లాస్టిక్ పై వేసిన నియంత్రణ ఉత్తర్వులను తొలగించారు. అమెరికానే అలా చేస్తే ఇతర దేశాలు తమకు ఎందుకు ఖర్చు అని అవి కూడా అదే పని చేస్తాయి.  

Also Read: ఈ వీధిలోకి షాపింగ్‌కు వెళ్తే కనీసం రూ.2 లక్షలు ఖర్చు ఖాయం - ప్రపంచంలో అత్యంత కాస్ట్‌లీ షాపింగ్ స్ట్రీట్ ఏదో తెలుసా ?

టాప్ హెడ్ లైన్స్

IAF Officer Honeytrap: పాక్ గూఢచారి హనీట్రాప్‌లో ఐఏఎఫ్ అధికారి.. ఒక్కో నగ్న చిత్రానికి ఒక్కొక్కటిగా సైనిక రహస్యాలు లీక్!
పాక్ గూఢచారి హనీట్రాప్‌లో ఐఏఎఫ్ అధికారి.. ఒక్కో నగ్న చిత్రానికి ఒక్కొక్కటిగా సైనిక రహస్యాలు లీక్!
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
Raptadu Accused Hemant: మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
Raptadu Accused Hemant: మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
Mohammed Shami Trade: ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!
ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!
AP CII Partnership Summit 2026: 12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
OM Trailer Review : O.M ట్రైలర్ వచ్చేసింది - ధనుష్ మాస్ యాక్షన్... టైటిల్ ఛేంజ్ చేశారుగా!
O.M ట్రైలర్ వచ్చేసింది - ధనుష్ మాస్ యాక్షన్... టైటిల్ ఛేంజ్ చేశారుగా!
Bigg Boss Season 10 Today November 13th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
Embed widget