అన్వేషించండి

AP Telangana Weather: మరో 4 రోజులు భానుడి ప్రతాపం, ఏపీలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు: IMD

AP Telangana Weather News: గత వారం తగ్గిన ఉష్ణోగ్రతలు ఈ వారం మరింతగా పెరగనున్నాయి. ఏపీలోని అనంతపురంలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు శనివారం నమోదయ్యాయి.

Heatwaves in Telangana and AP, Temperature: అకాల వర్షాలతో గత వారంలో నాలుగైదు రోజులు భానుడి భగభగలు తగ్గాయి. కానీ వేసవికాలం కావడంతో సూర్యుడి తీవ్రత అధికం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు 3 వారాల నుంచి ఎండలకు రాయలసీమ మండిపోతోంది. శనివారం (మార్చి 23న) దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత అనంతపురంలో 40.8 డిగ్రీలుగా నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో మార్చి 27 వరకు ఎండ వేడి కారణంగా ఉక్కపోత సైతం అధికం కానుంది. 

గత ఏడాది తరహాలోనే ఈసారి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో నేటి నుంచి మరో 4 రోజులు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత వారానికి భిన్నంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 2, 3 డిగ్రీలు అధికంగా ఉంటాయి. ఏపీలో శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. కానీ రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వాతావరణం పొడిగా మారనుంది.

4 రోజులు సూర్య ప్రతాపం.. 
Telangana Weather- తెలంగాణలో ఫిబ్రవరి నెలలోనే ఎండలు అధికమయ్యాయి. మార్చి రెండో వారం వరకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి పలు ప్రాంతాల్లో 39, 40 డిగ్రీలుగా నమోదయ్యాయి. నేటి నుంచి మరో 4 రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. ఈ నాలుగైదు రోజులు మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. పలు జిల్లాలల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. రాత్రి పూట సైతం ఉక్కపోత తప్పదు. ప్రజలు నీళ్లు ఎక్కువగా తాగాలని.. ఎండలో బయటకు వెళ్లేవారు కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు తాగడం మంచిదని అధికారులు చెబుతున్నారు.

ఏపీలోనూ పొడి వాతావరణం
ఏపీలోనూ సూరీడు సుర్రుమంటున్నాడు. మరో 4 రోజులు రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఉత్తర కోస్తాంధ్రతో పాటు దక్షిణ కోస్తాంధ్రలోనూ ఎండల తీవ్రత అధికంగా ఉండనుంది.  2 నుంచి 3 డిగ్రీలు పగటి ఉష్ణోగ్రత పెరుగుతుందని ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాయలసీమకు స్వల్ప వర్ష సూచన ఉంది. అయినా వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని, ప్రజలు అసౌకర్యానికి లోనవుతారని ఓ ప్రకటనలో తెలిపింది.

మార్చి 24 , 26 తేదీలలో పశ్చిమ బెంగాల్, సిక్కింలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి వర్షాలు పడే అవకాశం ఉంది. మార్చి 25, 26 తేదీలలో అరుణాచల్ ప్రదేశ్, గంగా పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్‌లలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Sachin Vs Kohli: సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget