అన్వేషించండి

Top Headlines Today: వైసీపీకి జంగా కృష్ణమూర్తి రాజీనామా- ఎన్నికల ముందు తగ్గిన గ్యాస్‌ సిలిండర్ రేట్లు

AP Telangana Latest News 01 April 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

AP Telangana News Today: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ రాజకీయం- అధికార ప్రతిపక్షాల మధ్య న్యూ వార్
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్‌ పంపిణీపై రాజకీయం రాజుకుంది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. ఇవాళ్టి నుంచి జరగాల్సిన సామాజిక పింఛన్ పంపిణీపై రెండు వర్గాలు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్‌లతో పింఛన్ పంపిణీ వద్దని... ప్రభుత్వ అధికారులే ఈ ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వాలంటీర్లపై అనేక ఆరోపణలు వస్తున్న వేళ వారితో పంపిణీ చేయిస్తే ఇంకా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈసీ భావించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

జగన్ కేసుల ట్రయల్ ఎందుకు ఆలస్యం - కారణాలు చెప్పాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కేసులో జాప్యంపై కారణాలు చెప్పాలని కోరింది. విచారణ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్ వేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. డిశ్చార్జ్ పిటిషన్‌ల వల్ల జాప్యం అవుతోందని కోర్టుకు సీబీఐ న్యాయవాది తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

లోక్‌సభ ఎన్నికల ముందు కానుక, తగ్గిన గ్యాస్‌ సిలిండర్ రేట్లు
సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ఘట్టం ప్రారంభానికి ముందు, దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక కానుక ఇచ్చింది. ఈ రోజు (01 ఏప్రిల్ 2024‌) నుంచి ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ప్రకటించాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు కాస్త ఉపశమనం కలగడంతో పాటు ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) ఇచ్చిన సమాచారం ప్రకారం... నేటి నుంచి దేశంలోని వివిధ నగరాల్లో ఎల్‌పీజీ సిలిండర్ల ధర రూ.30.50 వరకు తగ్గింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

వైసీపీకి జంగా కృష్ణమూర్తి రాజీనామా - ఈ వారంలో టీడీపీలో చేరే అవకాశం
పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మరో నేత షాకిచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత జంగా కృష్ణమూర్తి యాదవ్ వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన ఐదు లేదా ఆరో తేదీన  టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు అనుచరులు కూడాపెద్ద ఎత్తున టీడీపీలోచేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే  టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు.  జంగా రాకతో పల్నాడు జిల్లాలో టీడీపీకి మరితం బలం చేకూరనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఏపీ అసెంబ్లీ, లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు?
ఎన్నికల నేపథ్యంలో ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను దాదారు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల జాబితాపై ఓ స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila), రఘువీరారెడ్డి, జేడీ శీలం, ఇతర సీఈసీ సభ్యులు హాజరయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Embed widget