Top Headlines Today: గిడుగు రుద్రరాజు రాజీనామా, షర్మిలకు లైన్ క్లియర్! సీఎం రేవంత్ దావోస్ పర్యటనకు ప్లాన్స్
AP Telangana Latest News 15 January 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Telugu News Today: పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా, షర్మిలకు లైన్ క్లియర్!
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు గిడుగు రుద్రరాజు అందజేశారు. దీంతో వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమం అయింది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ జోడో యాత్రలో ఆదివారం (జనవరి 14) మణిపూర్‌లో పాల్గొన్న వైఎస్ షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవిపై ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'వైసీపీ ఫైనల్ లిస్ట్ వచ్చేది అప్పుడే' - ఒంగోలు ఎంపీ స్థానంలో పోటీపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభకు తాను పోటీ చేయనని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి (YV SubbaReddy) స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఒంగోలులో (Ongole) పోటీ చేయాలనుకుంటే.. 2019 ఎన్నికల్లోనే పోటీ చేసే వాడినని.. ఈ విషయాన్ని సీఎం జగన్ కు చాలాసార్లు చెప్పానని తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాలకు గ్యాప్ రావడంతోనే పార్టీ పనులు చూసుకుంటున్నట్లు చెప్పిన ఆయన, ఎన్నికల పోటీ విషయంలో అంతిమంగా జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సీఎం రేవంత్ దావోస్ పర్యటన - భారీ పెట్టుబడులే లక్ష్యం
సీఎంగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి విదేశీ పర్యటన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ (Davos)లో జరగనున్న 'వరల్డ్ ఎకనామిక్ ఫోరం' (World Economic Forum) 54వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు సీఎం నేతృత్వంలోని తెలంగాణ అధికారిక బృందం వెళ్లింది. ఈ నెల 19 వరకూ ఈ సదస్సు జరగనుండగా.. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం బిగ్ టార్గెట్ - కింగ్ మేకర్ అయ్యేనా?
మరో 2 నెలల్లో జరగనున్న ఏపీ(AP) అసెంబ్లీ(Assembly) ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రత్యేకంగా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. 2014కు ముందు జరిగిన రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. కాంగ్రెస్‌కు కంచుకోటలుగా ఉన్న అనేక నియోజకవర్గాల్లో పార్టీ నిర్వీర్యం అయిపోయింది. నాయకుల(Leaders) కన్నా.. ప్రజలే కాంగ్రెస్‌ను వదులుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అమలాపురం పార్లమెంటు స్థానంపై వైసీపీ వ్యూహం అదేనా?
అమలాపురం పార్లమెంటు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో సందిగ్ధం తొలగడం లేదు. ఇప్పటికే దాదాపు మూడు నాలుగు పేర్లు పరిశీలించిన వైసీపీ అధిష్టానం ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతోందట.. ఎస్సీ రిజర్వుడు స్థానం అయిన అమలాపురం పార్లమెంటు స్థానం ప్రత్యర్ధి పార్టీలకు చెందిన అభ్యర్థులను బలమైన వారిని దింపే ప్రయత్నంలో ఉండగా దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వైసీపీ చాలా పేర్లు పరిశీలిస్తుండగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే కాకినాడ, రాజమండ్రి పార్లమెంటు స్థానాలు ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి





















