అన్వేషించండి

Belt Shops: మందుబాబులకు షాక్, తెలంగాణలో లక్ష బెల్టు షాపులు మూసివేత!

Revanth Reddy Decision On Belt Shops: డ్రగ్స్ చెలామణి పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు.

Belt Shops in Telangana: హైదరాబాద్: డ్రగ్స్ చెలామణి పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) ఉన్నతాధికారులకు సూచించారు. మరోవైపు బెల్ట్ షాపులు మూసివేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా గ్రామాల్లోని బెల్ట్ షాపుల కారణంగా యువత, చిన్నారులు మద్యానికి బానిస అవుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష బెల్ట్ షాపులను నిషేధించాలని (Ban on Belt Shops) ప్లాన్ చేస్తోంది. ముందు బెల్ట్ షాపుల లెక్క తేల్చి, వాటి వల్ల దుష్ప్రరిణామాలు లేకుండా చేసేందుకు గ్రామాల్లోని ఈ లిక్కర్ దందాను బంద్ చేపించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బెల్టు షాపులను మూసివేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలు నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని బెల్టు షాపులపై ఉన్నతాధికారులు రిపోర్ట్ రూపొందించాలి. రాష్ట్రంలో 2,620 వైన్స్ షాపులు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఒక్కో గ్రామంలో 5 నుంచి 10 వరకు బెల్ట్ షాపులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉంటాయి. పలుచోట్ల ఈ బెల్ట్ షాపుల్లో నిరంతరం మద్యం విక్రయాలు జరుగుతాయి. వీటి కారణంగా యువతతో పాటు విద్యార్థులు చెడు మద్యానికి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు బెల్ట్ షాపుల వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గుతుంది. బెల్టు షాపులు క్లోజ్ చేసేలా వాటిపై ఉక్కుపాదం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది.

డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపండి - సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ కంట్రోల్ అంశంపై డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సోమవారం సమీక్ష జరిపారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవీ గుప్తా, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని  సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో కు పూర్తి స్థాయి డైరెక్టర్ ను నియమించడంతోపాటు ఆ విభాగం బలోపేతం చేయాలని సూచించారు. ఈ విభాగానికి కావాల్సిన నిధులు, వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు.  మాదక ద్రవ్యాలను విక్రయించే, చెలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలన్నారు. రాష్ట్రంలోని గ్రే హాండ్స్, ఆక్టోపస్ తరమాలో టీ.ఎస్.నాబ్ ను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ, ఔషధ నియంత్రణా మండలి, పోలీస్ శాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read: KCR Video: దయచేసి అందరూ వెళ్లిపోండి, వేయి చేతులెత్తి మొక్కుతా - కేసీఆర్ వీడియో విడుదల

టాప్ హెడ్ లైన్స్

Breaking News: జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
ABP Desam Top 10, 3 July 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 3 July 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Kadapa Steel Plant: మళ్లీ మళ్లీ జరగాలి పెళ్లి.. చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
మళ్లీ మళ్లీ జరగాలి పెళ్లి.. చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Pawan Kalyan Home Minister Portfolio: పవన్ కల్యాణ్ ఆఫీసులో సోషల్ మీడియా కేసులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్.. హోంశాఖ బాధ్యతలకు ఇది సంకేతమా?
పవన్ కల్యాణ్ ఆఫీసులో సోషల్ మీడియా కేసులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్.. హోంశాఖ బాధ్యతలకు ఇది సంకేతమా?
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EV vs Curvv EV: ఎక్కువ రేంజ్‌, కంఫర్ట్, మంచి స్పేస్‌ కోసం ఏ EV కొనాలి?
రూ.20 లక్షల బడ్జెట్‌లో Tata Sierra EV లేదా Curvv EV - ఏది బెస్ట్ ఛాయిస్?
Sanju Samson Under Pressure: సంజూ శాంసన్ కు పెరిగిపోతున్న కౌంట్‌డౌన్..  టెక్నికల్ లోపాలతో స‌త‌మ‌తం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి లైన్ క్లియర్!
సంజూ శాంసన్ కు పెరిగిపోతున్న కౌంట్‌డౌన్..  టెక్నికల్ లోపాలతో స‌త‌మ‌తం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి లైన్ క్లియర్!
Rains in Andhra Pradesh and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
Embed widget