Telangana Whips: ప్రభుత్వ విప్ లుగా నలుగురి ఎమ్మెల్యేల నియామకం - సర్కారు కీలక ఉత్తర్వులు
Telangana News: తెలంగాణ విప్ లుగా నలుగురి ఎమ్మెల్యేలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana New Whips: తెలంగాణ ప్రభుత్వ విప్ (Telangana Whips) లుగా నలుగురు ఎమ్మెల్యేలు (MLAs) నియమితులయ్యారు. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ (Adluru Laxman Kumar), ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (Beerla Ilaiah), డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ (RamaChandra Naik), వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Adi Srinivas)ను విప్ లుగా నియమించింది. మరోవైపు ప్రభుత్వ చీఫ్ విప్ నకు సంబంధించి కూడా త్వరలో నియామక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చీఫ్ విప్ గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్ రెడ్డి రంగారెడ్డి, వివేక్ , వేముల వీరేశం పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తుందని సమాచారం.
సామాజిక వర్గాల ఆధారంగా
తెలంగాణ ప్రభుత్వం సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకుని ఈ పదవులను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి గెలిచిన యాదవ సామాజిక వర్గానికి చెందిన ఐలయ్య, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రు నాయక్ లను విప్ లుగా నియమించారు. దీంతో ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీకి ఈ పదవులను ఇచ్చినట్లయింది.