News
News
X

Tata Technologies IPO: 18 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్‌ నుంచి మరో IPO, మార్కెట్‌ కళ్లన్నీ దీని మీదే!

ఈ కంపెనీలో తనకున్న మొత్తం వాటాలో కొంత భాగాన్ని ఇనీషియల్‌ పబ్లిక్ ఆఫర్ మార్గంలో ఉపసంహరించుకోవడానికి టాటా మోటార్స్‌ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది.

FOLLOW US: 
Share:

Tata Technologies IPO: 18 సంవత్సరాల విరామం తర్వాత, స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు టాటా గ్రూప్‌ ఒక గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ గ్రూప్‌ నుంచి మరో కంపెనీ పబ్లిక్‌ లిమిటెడ్‌గా మారబోతోంది.

టాటా గ్రూప్‌లోని టాటా టెక్నాలజీస్‌ కంపెనీ (Tata Technologies Ltd), అతి త్వరలో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (IPO) ప్రకటన చేసే అవకాశం ఉంది. హోమ్‌ గ్రోన్‌ ఆటో మేజర్ టాటా మోటార్స్‌కు ‍‌(Tata Motors) అనుబంధ కంపెనీగా అన్‌ లిస్టెడ్‌ సెగ్మెంట్‌లో ఇది బిజినెస్‌ చేస్తోంది. ఈ కంపెనీలో తనకు ఉన్న మొత్తం వాటాలో కొంత భాగాన్ని ఇనీషియల్‌ పబ్లిక్ ఆఫర్ మార్గంలో ఉపసంహరించుకోవడానికి టాటా మోటార్స్‌ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. అంటే, టాటా టెక్నాలజీస్‌ IPO గురించి త్వరలోనే మనం ఒక ప్రకటన వినే అవకాశం ఉంది.

టాటా మోటార్స్‌కు 74.43 శాతం వాటా
గ్లోబల్‌గా ప్రొడక్ట్ ఇంజినీరింగ్, డిజిటల్ సర్వీసెస్ అందిస్తున్న కంపెనీ టాటా టెక్నాలజీస్. ప్రపంచంలోని చాలా దేశాలకు ఇది ఎగమతులు చేస్తోంది. 2022 మార్చి 31 నాటికి, టాటా టెక్నాలజీస్‌లో టాటా మోటార్స్‌కు 74.43 శాతం వాటా ఉంది.

"డిసెంబర్ 12, 2022న జరిగిన సమావేశంలో, టాటా మోటార్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ద్వారా IPO కమిటీ ఏర్పాటైంది. మార్కెట్ పరిస్థితులు, వర్తించే అనుమతులు, రెగ్యులేటరీ క్లియరెన్స్‌లకు లోబడి అనుకూల సమయంలో IPO మార్గం ద్వారా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌లో పెట్టుబడిని టాటా మోటార్స్‌ పాక్షికంగా ఉపసంహరించుకుంటుంది" అని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో టాటా మోటార్స్ తెలిపింది.

TCS తర్వాత ఇదే మొదటి IPO
టాటా టెక్నాలజీస్‌కు అన్ని వైపుల నుంచి గ్రీన్‌ సిగ్నల్స్‌ అందితే, 18 సంవత్సరాల తర్వాత వస్తున్న టాటా గ్రూప్ మొదటి IPO అవుతుంది. 2017 జనవరిలో బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత గ్రూప్ చైర్మన్ N చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో వచ్చే మొదటి IPOగానూ ఇది నిలిస్తుంది. దీంతో, మార్కెట్‌ కళ్లన్నీ ఈ కంపెనీ మీదే ఉన్నాయి. 

టాటా గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ, ఇండియన్‌ IT మేజర్ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS), టాటా గ్రూప్‌ నుంచి వచ్చిన చివరి IPO. 2004లో TCS పబ్లిక్‌లోకి వచ్చింది.

టాటా గ్రూప్ నుంచి మరో కంపెనీ టాటా ప్లే (TATA PLAY) కూడా IPO కోసం సిద్ధం అవుతోంది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 13 Dec 2022 10:24 AM (IST) Tags: IPO tata group Tata Motors Tata Technologies Tata Motors subsidiary

సంబంధిత కథనాలు

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !

Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !

TS Minister KTR: నిధుల వరద పారిస్తా అన్నావ్ ! ఎన్ని పైసలు తెచ్చినవ్ ఈటల: మంత్రి కేటీఆర్ సెటైర్లు

TS Minister KTR: నిధుల వరద పారిస్తా అన్నావ్ ! ఎన్ని పైసలు తెచ్చినవ్ ఈటల: మంత్రి కేటీఆర్ సెటైర్లు

Nizamabad News: దక్షిణ మధ్య రైల్వేలో నిజామాబాద్ జంక్షన్ కీలకం - కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా న్యాయం జరిగేనా!

Nizamabad News: దక్షిణ మధ్య రైల్వేలో నిజామాబాద్ జంక్షన్ కీలకం - కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా న్యాయం జరిగేనా!

టాప్ స్టోరీస్

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌‌గా భారతి హోళికేరి

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌‌గా భారతి హోళికేరి

Nellore Anam : నెల్లూరు వైఎస్ఆర్‌సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !

Nellore Anam  :  నెల్లూరు వైఎస్ఆర్‌సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !