Japan Earthquake: జపాన్‌లో తీవ్ర భూప్రకంపనలు, సునామీ హెచ్చరికలు జారీ - వేలాది ఇళ్లకు పవర్ కట్
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది.
Earthquake in Japan:
జపాన్‌లో భూ ప్రకంపనలు అలజడి సృష్టించాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్ర 7.4గా నమోదైంది. సెంట్రల్ జపాన్‌లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. Japan Meteorological Agency వెల్లడించిన వివరాల ప్రకారం..పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీరప్రాంతాలను అప్రమత్తం చేశారు. 5 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగిసిపడి తీర ప్రాంతాలను ముంచే ప్రమాదముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నీగట, తొయామా, ఇషికావా ప్రాంత ప్రజలకు అలెర్ట్ జారీ చేశారు. వాజిమా నగర తీరాన్ని మీటర్ కన్నా ఎక్కువ ఎత్తైన అలలు వచ్చి తాకే ప్రమాదముంది. ప్రస్తుతానికి ప్రాణ,ఆస్తి నష్టాల వివరాలు వెల్లడి కాలేదు. అటు ఉత్తరకొరియా, రష్యాలోనూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. Pacific Tsunami Warning Centre ఈ మేరకు అప్రమత్తం చేసింది. టోక్యోతో పాటు కంటో ప్రాంతాల్లో ప్రకంపనలు తీవ్రంగా నమోదయ్యాయి. ఈ ప్రకంపనల కారణంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్‌లో అంతరాయం కలిగినట్టు Hokuriku Electric Power స్పష్టం చేసింది.
An earthquake with a preliminary magnitude of 7.6 hit north-central Japan. The Japan Meteorological Agency issued a tsunami warning along the western coastal regions of Ishikawa, Niigata and Toyama prefectures, reports Reuters
— ANI (@ANI) January 1, 2024
భూమి కంపించగానే వెంటనే ఇళ్లు వదిలి బయటకు రావాలని అధికారులు సూచించారు. నిజానికి ఎలాంటి భూకంపాలనైనా తట్టుకునేలా అక్కడ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. క్వాలిటీలో తేడా రాకుండా అధికారులు నిఘా పెడుతున్నారు. ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తున్నారు. అయినా భూకంపం వచ్చిన ప్రతిసారీ భారీగానే ఆస్తినష్టం వాటిల్లుతోంది. 2011లో నార్త్ జపాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 9 మ్యాగ్నిట్యూడ్‌తో భూమి కంపించింది. అది సునామీకి దారి తీసింది. ఈ విపత్తులో దాదాపు 18,500 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు గల్లంతయ్యారు. అందుకే...భూకంపం వస్తే చాలు అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు.
富山市 萩浦橋 津波到達中 pic.twitter.com/5TJkH4E1Mx
— 鈴木 一 (@hioooomn) January 1, 2024