Sharad Pawar New party : NCP శరద్ చంద్రపవార్ - శరద్ పవార్‌కు కొత్త పార్టీ పేరు కేటాయించిన ఈసీ !
Sharad Pawar : శరద్ పవార్ కొత్త పార్టీకి ఈసీ గుర్తింపు లభించింది. ఎన్సీపీ -శరద్‌చంద్ర పవార్ పేరును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

Sharad Pawar New party : శరద్ పవార్ కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. శరద్ పవార్ వర్గం మూడు పేర్లు, ఎన్నికల గుర్తులను ఈసీ ఆమోదం కోసం పంపింది. వీటిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- శరద్‌చంద్ర పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ -శరద్‌రావు పవార్, ఎన్సీపీ-శరద్ పవార్ పేర్లు ఉండగా.. ఎన్సీపీ -శరద్‌చంద్ర పవార్ పేరును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్‌సీపీ శరద్ చంద్రపవార్ పార్టీగా నామకరణం చేసింది. టీ కప్పు, పొద్దుతిరుగుడు పువ్వు, ఉదయించే సూర్యుడు గుర్తులు పరిశీలించాలని ఈసీని కోరినట్లు శరద్ పవార్ వర్గం పేర్కొంది. వీటిలో ఓ గుర్తు ఖరారయ్యే అవకాశం
లోక్‌సభ ఎన్నికల వేళ.. రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌కు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీ(NCP)గా గుర్తిస్తూ.. గడియారం గుర్తును ఆ వర్గానికే కేటాయించింది. ఎస్పీపీ ఎవరిదనే విషయంలో గత కొంతకాలంగా ఆ పార్టీ చీలిక వర్గాలు ఈసీ వద్ద పోరాటం చేశాయి.
ఎన్సీపీకి మొత్తంగా 53మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ ఆ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు 12మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నారు. గతేడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే-బీజేపీ సర్కారుకు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలో ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులయ్యారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. చివరికి అసలైన ఎన్సీపీ శరద్ పవార్ చేతి నుంచి చేజారిపోయింది.
ఫిబ్రవరి నెలాఖరులో రాజ్యసభ ఎన్నికలతోపాటు త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ పేరు, ఎన్నికల గుర్తును ఎంచుకోవాలని శరద్ పవార్ వర్గాన్ని ఈసీ కోరింది. బుధవారం సాయంత్రం 3 గంటలలోగా మూడు పార్టీల పేర్లు, గుర్తుల ప్రతిపాదనలు పంపాలని సూచించింది. అయితే అజిత్ వర్గానికే ఎన్సీపీ చెందుతుందన్న ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని శరద్ పవార్ వర్గం భావిస్తున్నది.
Before You Go
West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















