Ukraine Crisis Live Updates: ఉక్రెయిన్‌తో చర్చలకు పుతిన్ ఓకే- రష్యా అధ్యక్ష కార్యాలయం ప్రకటన
రెండో రోజు కూడా ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
LIVE
Background
ఉక్రెయిన్‌ను అన్ని వైపుల నుంచి రష్యా సేనలు చుట్టుముట్టాయి. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి రష్యా బలగాలు చొరబడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. తొలిరోజు యుద్ధంలో 137 మంది వరకు ఉక్రెయిన్ సైనికులు మృతి చెందినట్లు అధ్యక్షుడు ప్రకటించారు. స్నేక్ ద్వీపంలో తమకు లొంగేందుకు ససేమిరా అన్న 13 మంది ఉక్రెయిన్ సైనికులను రష్యా బలగాలు హతమార్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
#Melitopol. #UkraineInvasion pic.twitter.com/N0yzLzeKfE
— MI6 ROGUE (@mi6rogue) February 25, 2022
దేశం కోసం
Invading Russian forces press deep into Ukraine.
— AFP News Agency (@AFP) February 25, 2022
Russian forces have reached the outskirts of Kyiv. Ukraine President Zelensky says invading troops are targeting civilians and explosions can be heard in the besieged capital
For latest on the invasion: https://t.co/EmSWiHqNd0 pic.twitter.com/gw2ALPLqXf
హీరో ఆఫ్ ఉక్రెయిన్
చర్చలకు ఓకే
ఉక్రెయిన్ అధికారులతో చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. మిన్‌స్క్‌కు బృందాన్ని పంపిస్తామని ప్రకటించింది రష్యా అధ్యక్షుడి కార్యాలయం.
రష్యా కీలక ప్రకటన (Russia Statement)
ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతోన్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ ఆర్మీ లొంగిపోతే.. తాము చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి తెలిపారు.
ఖర్చులు ప్రభుత్వానివే
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం విమానాలను ఏర్పాటు చేస్తోంది. టికెట్ ఖర్చులను ప్రభుత్వమే భరించనున్నట్లు సమాచారం.
రష్యా ప్రకటన
ఉక్రెయిన్‌పై తాము చేపట్టిన సైనిక దాడి గురించి వివరాలను వెల్లడించింది రష్యా రక్షణ శాఖ
• 243 మంది ఉక్రెయిన్ సైనికులు సరెండర్
• మెరైన్ సైనిక విభాగం సరెండర్
• 118 సైనిక వాహనాలు ధ్వంసం. ఇందులో 11 వాయుసేన స్థావరాలు.13 కమాండ్, సమాచార కేంద్రాలు 300 క్షిపణులు, 36 రాడార్ స్టేషన్లు ఉన్నాయి.
• ఐదు యుద్ధ విమానాలు, ఓ హెలికాప్టర్, 5 డ్రోన్లు కూల్చివేత.
• 18 ట్యాంకులు, 7 రాకెంట్ లాంఛర్లు, 41 సైనిక వాహనాలు, 5 యుద్ధ పడవలు ధ్వంసం.
• చెర్నోబిల్ అణు కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది.
కీవ్‌లోకి రష్యా సేనలు
కీవ్‌లో ప్రభుత్వ భవనాలకు సమీపంలో కాల్పుల మోత మోగుతోంది.