Rachakonda CP Sudheer Babu: రాచకొండ సీపీగా సుధీర్ బాబు బాధ్యతలు, ఆ నేరాలపై స్పెషల్ ఫోకస్
Rachakonda News: రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబు బాధ్యతలు చేపట్టారు. తన మీద నమ్మకంతో బాధ్యత ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబు బాధ్యతలు చేపట్టారు. తన మీద నమ్మకంతో బాధ్యత ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ.. మూడు కమిషనరేట్స్ కో ఆర్డినేషన్ తో కలిసి పనిచేస్తాం అన్నారు. ముఖ్యంగా మహిళల భద్రత పై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తాం. నేరాలను అరికట్టడంలో అందరితో కలిసికట్టుగా పనిచేస్తామన్నారు.
డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ల్యాండ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలు లేకుండా కృషి చేస్తామన్నారు. రౌడీ షీటర్స్ పై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని, నేరాలు చేస్తే పోలీస్ శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ నేరాల ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేసి త్వరగతిన కేసులు షరిష్కరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ పై కూడా దృష్టి సారించనున్నారు. రిటైర్డ్ అయిన పోలీస్ అధికారుల సలహాలు కూడా తీసుకుని మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమన్నారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా నూతన టెక్నాలజీ ని ఉపయోగిస్తామని చెప్పారు. నిబద్దత తో పనిచేస్తున్న అధికారులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.