అన్వేషించండి

Poverty In India: భారత్‌లో 5% మేర తగ్గిపోయిన పేదరికం - నీతిఆయోగ్ నివేదిక

Poverty In India: భారత్‌లో పేదరికం 5% మేర తగ్గిపోయినట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది.

Poverty In India: భారత్‌లో పేదరికం 5% మేర తగ్గినట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది. నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈ విషయం తెలిపారు.  Household Consumption Expenditure Survey (HCES) రిపోర్ట్‌ని వెలువరించారు. 2022 ఆగష్టు నుంచి జులై 2023 వరకూ మధ్య కాలంలో ఈ సర్వే చేపట్టింది నీతి ఆయోగ్. కుటుంబాల ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని పేదరిక స్థాయి ఎలా ఉందో అధ్యయనం చేసింది. కొన్నేళ్లుగా పేదరికాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో పరిశీలించింది. ఈ మేరకు డేటాని విడుదల చేసింది. అటు గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ ఆదాయం పెరిగిందని స్పష్టం చేసింది. గతంతో పోల్చి చూస్తే...ఆదాయం 2.5 రెట్లు పెరిగిందని తెలిపింది. 2011-12 నుంచి పరిశీలిస్తే...పట్టణాల్లో నెలవారీ సగటు ఖర్చు 33.5% మేర పెరిగిందని వెల్లడించింది. ఇది ప్రస్తుతం రూ.3,510గా ఉందని వివరించింది. ఇదే గ్రామాల్లో చూస్తే..నెలవారీ సగటు ఖర్చు 40.42% మేర పెరిగిందని తెలిపింది. ఇది ప్రస్తుతం రూ.2,008కి చేరుకుందని స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్ ఆధారంగానే దేశవ్యాప్తంగా పేదరికం 5% మేర తగ్గిపోయిందని నివేదించింది. ఖర్చులు చేసే విధానం చాలా మారిపోయిందని, ముఖ్యంగా ఆహారం కోసం పెట్టే ఖర్చులు పెరిగాయని వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆహారం కోసం చేసే ఖర్చు 50% మేర పెరిగింది. 2004-05లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చుల విషయంలో చాలా అంతరం ఉండేదని, ఇప్పుడది 91% మేర తగ్గిపోయిందని నీతి ఆయోగ్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రాసెస్డ్‌ ఫుడ్‌, పండ్లు, పాల వినియోగం విపరీతంగా పెరిగింది. ఆయుష్మాన్ భారత్‌ స్కీమ్‌తో పాటు ఉచిత విద్య గురించీ ఇందులో ప్రస్తావించింది. 

గతేడాది కూడా రిపోర్ట్..

గతేడాది జులైలోనూ నీతి ఆయోగ్ ఓ నివేదిక వెలువరించింది. ప్రజల ఆస్తులు, బ్యాంకు ఖాతాలతోపాటు వారికి అందుతున్న విద్య, వైద్యం, పోషకాహారం, శిశు మరణాలు, బడికి వెళ్లే పిల్లలు, పాఠశాలల్లో హాజరు, వంటగ్యాస్ వినియోగం, పారిశుద్ధ్యం, విద్యుత్తు సరఫరా తదితర 12 అంశాలనే కొలమానంగా ఈ నివేదికను రూపొందించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ 12 అంశాలను ఆధారంగా చేసుకొని పరిస్థితులను స్టడీ చేసింది. అక్కడి ప్రభుత్వాలు ఇచ్చిన లెక్కలు ఆధారంగా 2015-16 నుంచి 2019-21 మధ్య పేదరికం భారీగా తగ్గినట్టు చెబుతోంది నీతి ఆయోగ్‌. అప్పట్లో 24.85 శాతం పేదరికం ఉంటే ఇప్పుడు అది 14.96కి తగ్గినట్టు పేర్కొంది. ఈ రేస్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ ముందంజలో ఉన్నాయి. నీతి ఆయోగ్ విడుదల చేసిన పేదరికం తగ్గుదల నివేదికలో ఏపీ 13వ స్థానంలో ఉంటే తెలంగాణ 14వ స్థానంలో ఉంది. సగుటున చూసుకుంటే మాత్రం ఏపీ 17వ స్థానంలో ఉంటే తెలంగాణ 14వ స్థానంలోనే కొనసాగుతోంది. ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 5.71 శాతం పేదరికం తగ్గింది. తెలంగాణలో 7.30 శాతం మంది విముక్తి పొందారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొంది. ఈ ఘనతను 2016-21 మధ్య కాలంలో సాధించినట్లు నీతి ఆయోగ్ తెలిపింది. 

Also Read: జ్ఞానవాపి మసీదు కేసులో మరో కీలక మలుపు, హిందువుల పూజలకు లైన్ క్లియర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
City Facelift EMI Calculator: కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ ఈఎంఐ లెక్కలు: టాప్ వేరియంట్ లోన్ టెన్యూర్, ఈఎంఐ వివ‌రాలు
కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ ఈఎంఐ లెక్కలు: టాప్ వేరియంట్ లోన్ టెన్యూర్, ఈఎంఐ వివ‌రాలు
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Skoda Kushaq EMI Calculator: స్కోడా కుషాక్ కొనేవారికి అలర్ట్: టాప్ వేరియంట్ ఈఎంఐ కాలిక్యులేషన్, లోన్ టెన్యూర్ వివరాలు ఇవే
స్కోడా కుషాక్ కొనేవారికి అలర్ట్: టాప్ వేరియంట్ ఈఎంఐ కాలిక్యులేషన్, లోన్ టెన్యూర్ వివరాలు ఇవే

వీడియోలు

Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
Peddi Hallallallo Song : పెద్ది హల్లల్లల్లో... ఫుల్ సాంగ్ - ఇద్దరు బ్యూటీస్‌తో చరణ్ స్టెప్పులు
పెద్ది హల్లల్లల్లో... ఫుల్ సాంగ్ - ఇద్దరు బ్యూటీస్‌తో చరణ్ స్టెప్పులు
Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
City Facelift EMI Calculator: కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ ఈఎంఐ లెక్కలు: టాప్ వేరియంట్ లోన్ టెన్యూర్, ఈఎంఐ వివ‌రాలు
కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ ఈఎంఐ లెక్కలు: టాప్ వేరియంట్ లోన్ టెన్యూర్, ఈఎంఐ వివ‌రాలు
Embed widget