అన్వేషించండి

Polavaram project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఫోకస్-పరిష్కార మార్గాలపై లోతుగా అధ్యయనం

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఫోకస్‌ పెట్టింది. నిర్మాణ లోపాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు రంగంలోకి దిగుతోంది. సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషిస్తోంది.

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఫోకస్‌ పెట్టింది. నిర్మాణ లోపాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు రంగంలోకి దిగుతోంది. సమస్యలను ఎలా అధిగమించాలని.. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో వరుసగా ఎదురవుతున్న సమస్యలు.. వారి పరిష్కారానికి తీసుకోవాల్సిన మార్గాలపై దృష్టిపెట్టి... నిర్మాణం పకడ్బందీగా సాగేందుకు ప్రణాళికలు రూపొందిచనుంది. దీని కోసం త్వరలోనే కేంద్రం బృందం సంయుక్త భేటీ నిర్వహించనుంది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా సమస్యలు ఎదురవుతున్నాయి. 2021 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని సీఎం జగన్‌ ఇచ్చిన హామీ కూడా నిలబడలేదు. ఇదంతా టీడీపీ హయాంలో జరిగిన తప్పుల వల్లే అంటోంది వైసీపీ సర్కార్‌. కాఫ‌ర్ డ్యామ్ పూర్తి చేయ‌కుండా డ‌యాఫ్రమ్ వాల్ కట్టారని ఆరోపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందని.. అందుకే పోలవరం ఆలశ్యమైందని చెప్తోంది. ఇక.. జగన్‌ మూర్ఖత్వం వల్లే పోలవరం పూర్తికావడంలేదని, డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటిన్నర సంవత్సరం పాటు ప్రధాన డ్యామ్ దగ్గర పనులే చేపట్టలేదన్నారు. 

వైసీపీ, టీడీపీ ఆరోపణలతో... పోలవరంపై రాజకీయ రగడ జరుగుతోంది. మరోవైపు గోదావరి మట్టం పెరిగినప్పుడల్లా వరద ముంపు ప్రాంతాలను ముంచెత్తోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం దృష్టి పెడుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న అనేక సవాళ్లను అధిగమించి ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కేంద్రజల్‌శక్తి శాఖ ప్రధాన సలహాదారు శ్రీరామ్‌ ఆధ్వర్యంలోని కేంద్రం బృందం పోలవరం నిర్మాణ సమస్యలపై కసరత్తు చేస్తోంది. 

పోలవరంలో స్పిల్‌వేపై ఒత్తిడి లేకుండా నిర్మించిన గైడ్‌బండ్‌ కుంగిపోయింది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు నిర్మించినా సీపీజే ప్రధాన డ్యాం ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. అంతకుముందు ఎగువ కాఫర్‌ డ్యాం సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల వరద ఉధృతికి ప్రధాన డ్యాం ప్రాంతంలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. డయాఫ్రం వాల్‌ ధ్వంసమైంది. పోలవరంలో కీలకమైన డయాఫ్రం వాలే కీలకం. దీంతో ప్రాజెక్టు ముందుకు వెళ్లాలంటే ఏం చేయాలో నిర్ణయం తీసుకోవల్సి ఉంది. దీంతో కేంద్ర జల్‌శక్తి పెద్దలు నడుం బిగించారు. కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రధాన సలహాదారు శ్రీరామ్‌ నేతృత్వంలో ఇందుకు కసరత్తు సాగుతోంది. కేంద్రం సంస్థలతో... జల్‌శక్తి శాఖ ప్రధాన సలహాదారు  శ్రీరామ్‌ అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోలవరం నిర్మాణంలో ఎక్కడ లోపాలు ఉన్నాయి... అనేది ఆరా తీస్తున్నారు. పరిష్కార మార్గాలు కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. సెప్టెంబరు 10 నాటికి ఈ కసరత్తు కొలిక్కిరావొచ్చని భావిస్తున్నారు.

కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రధాన సలహాదారు శ్రీరామ్‌... రాష్ట్ర జలవనరులశాఖ, పోలవరం అధికారులతోనూ సమావేశంకానున్నారు. ఆ తర్వాత కేంద్ర సంస్థలు, రాష్ట్ర అధికారులు, నిర్మాణ ఏజెన్సీలతో కీలక సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి బాధ్యతల బదలాయింపుపైనా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Chairman Reservations: ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు అగ్రతాంబూలం
ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు అగ్రతాంబూలం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget