India Canada Tensions: ఇండియన్స్‌కి వెంటనే వీసాలు ఇవ్వలేం, కెనడా కీలక ప్రకటన
India News: భారత్‌లో డిప్లొమాటిక్ స్టాఫ్ తగ్గించడం వల్ల వసాలు జారీ చేసే ప్రక్రియ ఆలస్యమవుతుందని కెనడా ప్రకటించింది.
Canada Visas Delay:
దౌత్యవేత్తల్ని తొలగించిన కెనడా..
భారత్‌లో 41 మంది దౌత్యవేత్తల్ని తొలగించింది కెనడా. భారత్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. క్రమంగా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించుకోవాలని గతంలోనే భారత్ హెచ్చరించింది. అప్పటి నుంచి విడతల వారీగా వాళ్లను తొలగిస్తూ వస్తోంది. అక్టోబర్ 20వ తేదీలోగా వీళ్లను తొలగించకపోతే రెండు దేశాల మధ్య ఇప్పుడున్న మైత్రి కూడా చెడిపోతుందని వార్నింగ్ ఇచ్చింది భారత్.
"భారత్ ఆదేశాల మేరకు క్రమంగా ఇండియాలోని కెనడా దౌత్యవేత్తల సంఖ్యని తగ్గిస్తున్నాం. అక్టోబర్ 20వ తేదీలోగా వీళ్ల సంఖ్యని తగ్గించాలని భారత్ ఆదేశించింది. ఈ మేరకు ఇమిగ్రేషన్, రెఫ్యూజిస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) ఇండియాలోని ఉద్యోగుల సంఖ్యని 27 నుంచి 5కి తగ్గించింది. ఇండియా నుంచి వచ్చే అప్లికేషన్స్‌ని మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ...స్టాఫ్ సంఖ్యని తగ్గిస్తున్నాం. ఈ కారణంగా ప్రాసెసింగ్ టైమ్‌పై ప్రభావం పడుతుంది"
- ఇమిగ్రేషన్, రెఫ్యూజిస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా
స్పందించిన విదేశాంగ శాఖ..
మొత్తంగా భారత్‌లో 42 మంది దౌత్యవేత్తలున్నట్టు కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జాలీ వెల్లడించారు. వీళ్లలో 41 మందిని వెనక్కి రప్పించింది. వీసా అప్లికేషన్‌ల ప్రాసెసింగ్‌లో జాప్యం కారణంగా భారతీయులకు వీసాలు జారీ చేయడంలో కాస్త ఆలస్యమవుతుందని కెనడా ప్రకటించింది. సిబ్బందిని తొలగించినప్పటికీ రోజువారీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. అయితే...ఈ ప్రకటనపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. దాదాపు నెల రోజులుగా కెనడాతో దౌత్య చర్యలు జరుపుతున్నట్టు ప్రకటించింది. దౌత్య సంబంధాలకు సంబంధించిన Vienna Convention ప్రకారమే నడుచుకుంటున్నట్టు వెల్లడించింది. అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఊరుకోం అని హెచ్చరించింది.
MEA issues statement, "We have seen the Statement by the Government of Canada on October 19 regarding Canadian diplomatic presence in India. The state of our bilateral relations, the much higher number of Canadian diplomats in India, and their continued interference in our… pic.twitter.com/6tKlgepHVG
— ANI (@ANI) October 20, 2023
జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య జరిగింది. గురుద్వారా వెలుపల హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చి చంపారు. ఇది భారత్ రహస్య ఏజెంట్ల పనే అని కెనడా ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి విశ్వసనీయ సమాచారం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. నిజ్జర్ హత్యతో తమ ఏజెంట్లకు సంబంధం ఉందన్న ట్రూడో ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. రాజకీయ దురుద్ధేశంతోనే కెనడా ఈ ఆరోపణలు చేసిందని కొట్టిపారేసింది భారత్. భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. అప్పటి నుంచి భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం కొనసాగుతూనే ఉంది. భారత్ కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంది. అక్టోబర్ 10లోగా, తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకోవాలని కెనడాకు డెడ్‌లైన్ పెట్టింది.
Also Read: ఆవేశం కాదు ఆలోచన అవసరం, అమెరికా చేసిన తప్పుల్నే మీరూ చేయకండి - ఇజ్రాయేల్‌కి బైడెన్ సలహా