అన్వేషించండి

Delhi AI Summit: పాత గొడవలుంటే చేతులు కూడా కలపరు - ఎంత పెద్ద సీఈవోలయిన అంతే -ఏఐ సమ్మిట్‌లో ఏ జరిగిందంటే?

Altman Vs Amodei: ఏఐ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ సీఈవోలు చేతులు కలిపేందుకు ఆసక్తి చూపించలేదు. మోదీ పాల్గొన్న కార్యక్రమంలోనే ఇది జరిగింది.

OpenAI Altman Anthropic Amodei at Delhi Summit:ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ లో  ఓపెన్ ఏఐ (OpenAI) సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, ఆంత్రోపిక్ (Anthropic) సీఈఓ డారియో అమోడెయ్ ఒకే వేదికను పంచుకోవడం ప్రపంచ టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే వీరిద్దరూ ఇలా వేదికను పంచుకోవడం మాత్రమే కాదు.. వారు ఇద్దరూ చేతులు కలపాల్సిన సందర్భం వస్తే .. పట్టించుకోలేదు. ఇది వైరల్ అవుతోంది.  వీరిద్దరి మధ్య ఉన్న వృత్తిపరమైన పోటీ, గతానుభవాల దృష్ట్యా ఆ వేదికపై ఒక విధమైన ఇబ్బందికర వాతావరణం నెలకొంది. కృత్రిమ మేధ   రంగంలో అగ్రగామిగా ఉన్న ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య ఉన్న విభేదాలు ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చాయి.

ఆంత్రోపిక్ వ్యవస్థాపకుడైన డారియో అమోడెయ్ గతంలో ఓపెన్ ఏఐలోనే కీలక బాధ్యతలు నిర్వహించేవారు. ఆయన అక్కడ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అయితే, ఓపెన్ ఏఐ పనితీరు, భద్రతా ప్రమాణాలు, ఆ సంస్థ  కమర్షియలైజేషన్ వైపు వెళ్తున్న తీరుపై డారియోకు సామ్ ఆల్ట్‌మాన్‌తో విభేదాలు వచ్చాయి. ఏఐ వ్యవస్థల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన 2021లో ఓపెన్ ఏఐ నుంచి బయటకు వచ్చి, తన సోదరి గూడెన్ అమోడెయ్‌తో కలిసి  ఆంత్రోపిక్ ను స్థాపించారు.   

ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ నుంచి ఓపెన్ ఏఐ భారీ పెట్టుబడులను స్వీకరించడం డారియోకు నచ్చలేదని టెక్ వర్గాలు చెబుతుంటాయి. లాభాపేక్ష లేని సంస్థగా మొదలైన ఓపెన్ ఏఐ, లాభాల బాట పట్టడం వల్ల ఏఐ భద్రత  విషయంలో రాజీ పడుతుందేమోనన్నది ఆయన ఆందోళన. అందుకే ఆంత్రోపిక్ సంస్థను ఒక  పబ్లిక్ బెనిఫిట్ కార్పొరేషన్ గా తీర్చిదిద్ది, క్లాడ్ వంటి సురక్షితమైన ఏఐ మోడళ్లను రూపొందించడంపై ఆయన దృష్టి పెట్టారు.   

ఢిల్లీ సదస్సులో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చున్నప్పుడు వారి మధ్య మునుపటి సాన్నిహిత్యం కనిపించలేదు. పరస్పరం పలకరించుకోలేదు.  అందరూ చేతులు కలిపి ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలోనూ వారు చేతులు పైకి ఎత్తారు కానీ.. ఒకరి చేతుల్లో ఒకరు చేతులు వేయలేదు.   ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్స్ అయిన చాట్ జీపీటీ,  క్లాడ్  మధ్య జరుగుతున్న పోటీ, ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న  కోల్డ్ వార్ కు ప్రతిరూపంగా నిలుస్తోంది.  సాధారణంగా టెక్ రంగంలో ఇలాంటి పోటీ సహజమే అయినప్పటికీ, ఒకే మూలాలు ఉన్న ఈ ఇద్దరు నేతలు రెండు వేర్వేరు ధృవాలుగా మారడం ఏఐ భవిష్యత్తుపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.   

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill Ranking Surge: నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!
నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!
ABP Desam Top 10, 22 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 22 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget