అన్వేషించండి

Nitish Kumar: నితీశ్ అనే నేను 8 సార్లు సీఎం అయ్యాను - రాజకీయాల్లో అరుదైన రికార్డ్ ఇది

Nitish Kumar: 20 ఏళ్లలో నితీశ్ కుమార్ 8 సార్లు బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Nitish Kumar Swearing Record: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సీఎంగా (Nitish Kumar) ప్రమాణ స్వీకారం చేయనున్నారు..! ఇది చదవడానికి, వినడానికి వింతగానే అనిపిస్తుంది. కానీ...మరి కొద్ది గంటల్లో ఇదే జరగనుంది. తేదీ మారుతుందని కానీ ఆ పదవి మారదు. ఇలా ఒక్కసారి కాదు. గత 20 ఏళ్లలో ఇప్పటికే 8 సార్లు బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నితీశ్ కుమార్. దేశ రాజకీయాల్లో ఇదో రికార్డు. 2022లో NDAతో తెగదెంపులు చేసుకున్నారు నితీశ్. ఉన్నట్టుండి బయటకు వచ్చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్, RJD మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా 8వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడే కాదు. 2005 నుంచి ఈ సీఎం రేసులో ఉన్నారు నితీశ్ కుమార్. 2014-15 లో మాత్రం జితన్ రామ్ మాంజి నితీశ్‌కి గట్టి పోటీ ఇచ్చి ఆ పదవిని సొంతం చేసుకున్నారు. నిజానికి 2000 సంవత్సరంలోనే తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నితీశ్ కుమార్. కానీ ఆయన ప్రభుత్వం వారం రోజులు కూడా నిలబడలేదు. బలపరీక్షలో ఓడిపోవడం వల్ల ప్రభుత్వం కూలిపోయింది. ఫలితంగా మళ్లీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఆ తరవాత ఐదేళ్లకు అంటే 2005లో జేడీయూ, బీజేపీ పొత్తు పెట్టుకోడం వల్ల మెజార్టీ సీట్లు సాధించారు. JDU 88 సీట్లు సాధించింది. బీజేపీ 55 చోట్ల గెలిచింది. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడే ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్నారు నితీశ్. ఈ సారి ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ తరవాత 2010లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించి సీఎం పదవిని చేపట్టారు. కాకపోతే 2014లో ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి దిగిపోయారు. 

అటు ఇటు ఊగుతూ..

2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో JDU,RJD, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవి నితీశ్ కుమార్‌నే వరించింది. అయితే..ఈ మహాఘట్‌బంధన్‌లో కొన్ని విభేదాలు తలెత్తాయి. సైద్ధాంతికంగా ఒక పార్టీ మరో పార్టీతో విభేదించింది. ఫలితంగా...2017 జులైలో మహాఘట్‌బంధన్‌ నుంచి తప్పుకున్నారు. వెంటనే బీజేపీ మద్దతుతో మరోసారి అధికారంలోకి వచ్చారు. అప్పుడూ ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరవాత అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి 2022లో బీజేపీకి గుడ్‌బై చెప్పారు. NDA నుంచి బయటకు వచ్చేశారు. బీజేపీతో సరిపడడం లేదంటూ తేల్చి చెప్పారు. RJD,కాంగ్రెస్‌ మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 8వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆ కూటమికీ గుడ్‌బై చెబుతున్నారన్న సంకేతాలు వచ్చేశాయి. మళ్లీ బీజేపీతో కలిసి నడిచేందుకే నితీశ్ ఆసక్తి చూపిస్తున్నారట. అంతా సవ్యంగా జరిగితే జనవరి 28వ తేదీనే ఆయన 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఇలా ఆయన రికార్డుని ఆయనే బద్దలు కొడుతున్నారు. 

 Also Read: నితీశ్ యూటర్న్‌పై అలెర్ట్ అయిన కాంగ్రెస్, RJDతో భేటీకి పిలుపు

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget