అన్వేషించండి

PM Modi: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధులు రేపు విడుదల- జాబితాలో మీ పేరు ఉందా? చెక్ చేసుకోండిలా!

PM Kisan Samman Nidhi Scheme: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధులను మోదీ విడుదల చేయనున్నారు. యూపీ వేదికగా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు.

రైతులకు కేంద్రం చేసే సాయం నిధులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధులు మంగళవారం విడుదలకానున్నాయి. ఈ పథకానికి అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు కేంద్రం జమ చేయనుంది. ఏటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తోంది. 2024-25 ఏడాదికి సంబంధించిన తొలి విడత నిధులను మంగళవారం విడుదల చేయనున్నారు. 
ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన రోజునే పీఎం కిసాన్ పెట్టుబడి సాయంపై మోదీ తొలి సంతకం చేశారు. 2018-19 నుంచి ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం చేస్తోంది కేంద్రం. తొలి విడత నిధులు మే- జూన్‌ నెల్లో ఇస్తే అక్టోబర్- నవంబర్‌లో రెండో విడత, జనవరి పిబ్రవరిలో మూడో విడత నిధులు ఇస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 16 విడతల్లో రైతులకు సాయం చేశారు. ఇప్పుడు 17 విడతలో నిధులు విడుదల చేస్తున్నారు. పదహారు విడతల్లో మూడు లక్షల కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. 
ఏ ఆర్థిక సంవత్సరంలో చేసే మొదటి విడత పీఎం కిసాన్ నిధుల విడదల ద్వారా 870 కోట్లు జమ చేయనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో పీఎం కిసాన్ నిధులను ప్రధానమంత్రి విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా తాము అధికారంలోకి వస్తే ఈ పెట్టుబడి సాయం పెంచుతామని చెప్పారు. ఆ నిధులను పీఎం కిసాన్ సమ్నాన్ నిధులతోపాటు విడుదల చేస్తారా లేకుంటే తర్వాత విడుదల చేస్తారా అని తెలియడం లేదు. 

లబ్ధిదారుల జాబితాలో మీరు ఉందో లేదో చూశారా?

ఈ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ కానున్నాయి. అలా డబ్బులు పడిన వెంటనే మొబైల్‌కి మెసేజ్ రానుంది. ఇప్పటికే కేవైసీ పూర్తి చేయని వారిని ఈ జాబితా నుంచి తొలగించారు. అంతే కాదు సరైన పత్రాలు లేకపోయినా, చనిపోయిన రైతులను అనర్హులుగా తేల్చారు. వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తారు. ఈ టైంలో కొందరు అర్హుల పేర్లు కూడా పొరపాటున తీసేసే అవకాశం ఉంది . అందుకే  అలా జరిగి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం కూడా చాలా సులభం. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌ https://pmkisan.gov.in/ కి వెళ్తే... అందులో ఫార్మర్ కార్నర్ ఉంటుంది. 

ఫార్మర్‌ కార్నర్‌పై క్లిక్ చేస్తే నో యువ స్టాటస్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్‌ ద్వారా మీ వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీ రిజిస్ట్రేషన్ నెంబర్‌  ఎంటర్‌ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ ఎంట్ చేయాలి. తర్వాత ఓటీపీపై క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంట్ చేసి క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితా వస్తుందని అందులో మీ పేరు  ఉందో లేదో చెక్ చేసుకోండి. 

రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేని వాళ్లు ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఆధారంగా తెలుసుకోవచ్చు. నో యూవర్ స్టాటస్‌ లోనే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేస్తే ఫోన్‌ నెంబర్ లేదా, ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి. అవి ఎంటర్ చేసిన వెంటనే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS vs Congress: రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్
రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Embed widget