అన్వేషించండి

మోదీ రిటైర్ అయ్యే ఛాన్సే లేదు, బీజేపీ రాజ్యాంగంలో అలాంటి రూల్‌ లేదు - కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై అమిత్ షా క్లారిటీ

Amit Shah: ప్రధాని మోదీ రిటైర్ అవుతారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై అమిత్‌ షా తీవ్రంగా స్పందించారు.

Amit Shah on Modi Retirement: మూడోసారి అధికారంలోకి వస్తే నరేంద్ర మోదీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటారని, అమిత్ షా ప్రధాని అవుతారని అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ కామెంట్స్‌పై అమిత్‌ షా స్పందించారు. 75 ఏళ్లు నిండగానే మోదీ రాజకీయాల నుంచి తప్పుకుంటారని కేజ్రీవాల్ అనవసరంగా కలలు కంటున్నారని చురకలు అంటించారు. బీజేపీ రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏమీ లేదని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీయే ప్రధానిగా ఉంటారని..ఈ విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష కూటమికి అలాంటి శుభవార్త ఏమీ ఉండకపోవచ్చంటూ సెటైర్లు వేశారు. 

"అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ప్రతిపక్ష కూటమికి ఓ విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. 75 ఏళ్లు రాగానే రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిబంధన బీజేపీ రాజ్యాంగంలో లేదు. నరేంద్ర మోదీ రానున్న ఐదేళ్ల పాటు ప్రధానిగా ఉంటారు. ఆయనే దేశానికి నాయకత్వం వహిస్తారు. ఈ విషయంలో బీజేపీలో ఎలాంటి సందిగ్ధత లేదు"

- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి

అమిత్ షా ఇంకేమన్నారంటే..

అరవింద్ కేజ్రీవాల్‌పైనా సెటైర్లు వేశారు అమిత్ షా. ఆయనకు కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే వచ్చిందని స్పష్టం చేశారు. ఈ తాత్కాలిక ఉపశమనం ఆయనను లిక్కర్ స్కామ్‌ నుంచి బయటపడేయలేదనవి తేల్చి చెప్పారు. కేవలం ఎన్నికల ప్రచారం చేసుకోడానికి మాత్రమే కోర్టు బెయిల్ ఇచ్చిందని గుర్తు చేశారు. తన అరెస్ట్‌ని అక్రమం అని వాదించే పనిలో ఉన్నారని, కానీ కోర్టు ఆ ఆరోపణలను అంగీకరించలేదని అన్నారు. జూన్ 2వ తేదీన కేజ్రీవాల్ మళ్లీ ఈడీకి లొంగిపోవాల్సిందేనని వెల్లడించారు. మధ్యంతర బెయిల్‌ ఇవ్వడాన్ని క్లీన్ చిట్‌గా భావిస్తే ఆయనకు చట్టం గురించి పెద్దగా అవగాహన లేదనుకోవాల్సి ఉంటుందని అన్నారు. 

కేజ్రీవాల్ ఏమన్నారు..?

జైల్ నుంచి బయటకు వచ్చిన తరవాత తొలిసారి ఎన్నికల ప్రచారం చేసిన కేజ్రీవాల్ ప్రధాని మోదీ రిటైర్‌మెంట్‌ గురించి ప్రస్తావించారు. బీజేపీ మరోసారి అదికారంలోకి వస్తే మోదీ రిటైర్ అవుతారని, అమిత్ షా ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. అంతే కాదు. యోగి ఆదిత్యనాథ్‌ పొలిటికల్ కెరీర్‌కి కూడా ఎండ్ కార్డ్ పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్వానీ, మురళీమనోహర్ జోషి తరహాలోనే యోగి ఆదిత్యనాథ్‌ పక్కకు తప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. రెండు నెలల్లో అంతా మారిపోతుందని తేల్చి చెప్పారు. 

Also Read: UP News: హోటల్‌ గదిలో ఇద్దరు వ్యక్తులతో భార్య, తట్టుకోలేక చెప్పుతో చితకబాదిన భర్త

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం మాకు అక్కర్లేదు: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం మాకు అక్కర్లేదు: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
లగ్జరీ కార్ లవర్స్‌కు షాక్: ఏప్రిల్ నుండి పెరగనున్న బీఎమ్‌డబ్ల్యూ, మినీ కార్ల ధరలు!
లగ్జరీ కార్ లవర్స్‌కు షాక్: ఏప్రిల్ నుండి పెరగనున్న బీఎమ్‌డబ్ల్యూ, మినీ కార్ల ధరలు!
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
This Week OTT Movies : శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
Online Scams : ఆన్​లైన్​ మోసాల నుంచి తప్పించుకోవాలంటే.. ఈ 5 టిప్స్ గుర్తుంచుకోండి, లేకపోతే భారీ నష్టం తప్పదు
ఆన్​లైన్​ మోసాల నుంచి తప్పించుకోవాలంటే.. ఈ 5 టిప్స్ గుర్తుంచుకోండి, లేకపోతే భారీ నష్టం తప్పదు
Embed widget