News
News
వీడియోలు ఆటలు
X

Meta Layoffs: మెటాలో మళ్లీ లేఆఫ్‌లు, వచ్చే నెలలో మరో రౌండ్ కూడా ఉంటుందట!

Meta Layoffs: మెటాాలో మరో విడత లేఆఫ్‌లు కొనసాగనున్నట్టు బ్లూంబర్గ్ న్యూస్ వెల్లడించింది.

FOLLOW US: 
Share:

Meta Layoffs:

లేఆఫ్‌లు 

మెటా మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మళ్లీ లేఆఫ్‌లు ప్రకటించనుంది. టీమ్‌ రీస్ట్రక్చర్‌లో భాగంగా మరి కొంత మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మేనేజర్‌లకు ఈ విషయమై సమాచారం కూడా అందించింది మెటా యాజమాన్యం. మెమోల ద్వారా మేనేజర్లు టీమ్ మెంబర్స్‌కి ఈ లేఆఫ్‌ల గురించి చెప్పాలని ఆదేశించింది. Bloomberg News ఇదే విషయాన్ని రిపోర్ట్ చేసింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు రియాల్టీ ల్యాబ్స్‌లోని ఉద్యోగులపైనా ఈ ఎఫెక్ట్ పడనుంది. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది మెటా. ఈ ఏడాది మార్చిలోనే జుకర్ బర్గ్ కీలక ప్రకటన చేశారు. 10 వేల మందిని తొలగించనున్నట్టు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నారు. మే నెలలో మరో రౌండ్‌ లేఆఫ్‌లు ఉండనున్నాయి. ఇప్పటికే గతేడాది నవంబర్‌లో మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 13% మందిని తొలగించింది మెటా. 11 వేల మందిని ఫైర్ చేసింది. ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్‌లోనూ ఇదే కొనసాగింది. స్టాఫ్ బ్యాలెన్సింగ్ కోసం ఈ లేఆఫ్‌లు (Layoffs) ప్రకటించక తప్పడం లేదని గతంలోనూ జుకర్‌ బర్గ్ వెల్లడించారు. ఇప్పుడు టీమ్ రీఆర్గనైజేషన్‌లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు తెలిపారు. ఇక మిగిలిన ఉద్యోగులను కొత్త ప్రాజెక్టుల్లోకి బదిలీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉండగా, 2022 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు 2.90 లక్షల మందిపై వేటుపడింది.

జుకర్‌పై ఉద్యోగుల అసహనం..

కాస్ట్ కటింగ్‌లో భాగంగా తప్పడం లేదని సీఈవో జుకర్ బర్గ్ చెబుతున్నా ఆ కంపెనీపై అసహనం అయితే పెరుగుతోంది. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకూ జాబ్ గ్యారెంటీ లేకుండా పోతోంది. ఇలాంటి కీలక తరుణంలో ఉద్యోగులతో మీటింగ్ పెట్టారు జుకర్‌బర్గ్. మార్చి 16న ఈ సమావేశం జరిగినట్టు The Washington Post వెల్లడించింది. అయితే...ఈ మీటింగ్‌లో ఉద్యోగులందరూ జుకర్‌బర్గ్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. కంపెనీ పరిస్థితేంటి అని నేరుగానే ఉద్యోగులు జుకర్‌ను ప్రశ్నించారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. అటు జుకర్ బర్గ్ మాత్రం కంపెనీ రీఆర్గనైజేషన్‌ గురించి మాట్లాడారట. వర్క్‌ఫ్రమ్ హోమ్ గురించి కూడా అడగ్గా...దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని సమాధానమిచ్చారు జుకర్‌బర్గ్. 

"జుకర్‌బర్గ్‌ను ఉద్యోగులు ఎన్నో ప్రశ్నలు వేశారు. ఈ కంపెనీని ఎలా నమ్మమంటారు అని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు రౌండ్‌ల లేఆఫ్‌లు పూర్తయ్యాక...జాబ్ సెక్యూరిటీ పరిస్థితేంటని అడిగారు. అయితే అందుకు జుకర్‌బర్గ్ కూడా సమాధానం చెప్పారు. కేవలం పర్‌ఫార్మెన్స్ ఆధారంగానే లేఆఫ్‌లు చేపడుతున్నట్టు వివరించారు. ఎంప్లాయిస్ అందరూ తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. మనం పెట్టుకున్న ఏ మేరకు చేరుకుంటున్నాం అనే దానిపైనే ఈ లేఆఫ్‌లు ఉంటాయని చెప్పారు. మనం సాధించాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు. 

- వాషింగ్టన్ పోస్ట్ 

Also Read: India Population: చైనా రికార్డుని బద్దలు కొట్టిన భారత్, జనాభాలో ఫస్ట్ ర్యాంక్‌ మనదే

Published at : 19 Apr 2023 02:31 PM (IST) Tags: Meta Meta Layoffs Layoffs Layoffs in Facebook Zucker Berg

సంబంధిత కథనాలు

రాముడిని లంకకు తీసుకెళ్లింది ఆదివాసీలే, హనుమంతుడు కూడా ఆదివాసీయే - కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

రాముడిని లంకకు తీసుకెళ్లింది ఆదివాసీలే, హనుమంతుడు కూడా ఆదివాసీయే - కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

PNB SO Application: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 240 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తుకు రేపటితో ఆఖరు!

PNB SO Application: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 240 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తుకు రేపటితో ఆఖరు!

Postal Jobs: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

Postal Jobs: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

Biparjoy Cyclone: బలపడుతున్న బిపార్జాయ్ తుపాను, రానున్న 24 గంటలు అత్యంత కీలకం - IMD

Biparjoy Cyclone: బలపడుతున్న బిపార్జాయ్ తుపాను, రానున్న 24 గంటలు అత్యంత కీలకం - IMD

Top 10 Headlines Today: సైకిల్ ఎక్కబోతున్న ఆ ముగ్గురు, సరూర్‌నగర్‌ హత్య కేసులో సాయికృష్ణ హాంగామా

Top 10 Headlines Today: సైకిల్ ఎక్కబోతున్న ఆ ముగ్గురు, సరూర్‌నగర్‌ హత్య కేసులో సాయికృష్ణ హాంగామా

టాప్ స్టోరీస్

Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Telangana News :  కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Tirupati News : శ్రీవారి సేవలో బీజేపీ అగ్రనేతలు - కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

Tirupati News :  శ్రీవారి  సేవలో బీజేపీ అగ్రనేతలు -  కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

జగన్‌ను చూసి నేర్చుకో- చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు

జగన్‌ను చూసి నేర్చుకో- చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు