By: Ram Manohar | Updated at : 03 Mar 2023 01:29 PM (IST)
మేఘాలయలో బీజేపీ మద్దతుతో ఎన్‌పీపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.
Meghalaya Political Crisis:
మేజిక్ ఫిగర్ రాలేదు..
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో National People's Party (NPP) 26 స్థానాలు దక్కించుకుంది. 59 నియోజకవర్గాలున్న మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 30. అయితే...NPP మేజిక్ ఫిగర్‌ను చేరుకోకపోయినప్పటికీ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతుని BJP ఇస్తుందని చెప్పారు. ఇప్పటికే తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు సంగ్మా.
"మాకు బీజేపీ అన్ని విధాలుగా సహకరిస్తోంది. NPPనేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతినివ్వాలని గవర్నర్‌ను కలుస్తాం. బీజేపీతో పాటు అన్ని పార్టీలు మాకు మద్దతుగా నిలబడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం మాకుంది. అయితే ఏయే పార్టీలు మాతో కలిసి వస్తాయన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా,ప్రధాని నరేంద్ర మోదీతో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వాళ్లు హాజరవుతారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మాకు కన్‌ఫర్మేషన్ రావాల్సి ఉంది."
కొన్రాడ్ సంగ్మా, మేఘలాయ ముఖ్యమంత్రి
Meghalaya: NPP's Conrad Sangma submits resignation as CM, stakes claim to form new govt
— ANI Digital (@ani_digital) March 3, 2023
Read @ANI Story | https://t.co/M7dkGjJlwR#Meghalaya #ConradSangma #ChiefMinister pic.twitter.com/jRftA37yQd
It's unfortunate. This shouldn't have happened. Violence took place at different places but situation is under control. I urge to people and all political parties that elections are over & violence is not the way forward & should not indulge in any kind of violence: Meghalaya CM https://t.co/8aWYHgfrTg pic.twitter.com/mcCbOp1RrK
— ANI (@ANI) March 3, 2023
ఫలితాల తరవాత రాష్ట్రంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. దీనిపైనా స్పందించారు సీఎం సంగ్మా.
"ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. కొన్ని చోట్ల హింస చెలరేగింది. కానీ ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ఎన్నికలు పూర్తయ్యాయి. రాజకీయ పార్టీలు, ప్రజలకు నేను చెప్పేది ఒకటే. ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకండి"
కొన్రాడ్ సంగ్మా, మేఘలాయ ముఖ్యమంత్రి
Meghalaya | The district administration of West Jaintia Hills has imposed curfew in Sahsniang village till further orders, following post-vote counting violence pic.twitter.com/yZ1n4sjqi4
— ANI (@ANI) March 3, 2023
సంగ్మా నేతృత్వంలోని NPP రెండోసారి మంచి మెజార్టీతో విజయం సాధించింది. అటు బీజేపీ మాత్రం గట్టిగానే పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించినా విఫలమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా వచ్చి ప్రచారం చేసినా కేవలం 2 సీట్లకే పరిమితమైంది.
Also Read: Holi 2023: హోళి వేడుకల్లో పిచ్చి పాటలు పెట్టొద్దు, గీత దాటితే వాత పెడతాం - యోగి ఆదిత్యనాథ్
Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!
Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు
Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్
Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు
జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్