MCD Election Results 2022: చరిత్ర సృష్టించిన ఆప్ అభ్యర్థి- MCD సభ్యురాలిగా తొలిసారి ట్రాన్స్‌జెండర్!
MCD Election Results 2022: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ నిలబెట్టిన ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి బోబి విజయం సాధించారు.

MCD Election Results 2022: 15 ఏళ్ల భారతీయ జనతా పార్టీ జైత్రయాత్రకు బ్రేకులు వేస్తూ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో పాటు ఓ ఆప్ అభ్యర్థి అరుదైన రికార్డ్ నెలకొల్పారు.
తొలిసారి
సుల్తాన్‌పురి-ఏ వార్డులో ఆప్ తరపున పోటీ చేసిన బోబి విజయం సాధించారు. దీంతో తొలిసారి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఎంసీడీ సభ్యురాలిగా ఎన్నికైనట్లయింది. తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి వరుణ్ థాకాపై బోబి 6714 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ విజయం పట్ల బోబి హర్షం వ్యక్తం చేశారు.
"I want to dedicate my victory to the people who worked so hard for me. I would like to thank everyone. Now I just have to work for development in my area," said Bobi, the AAP candidate from transgender community who won from Sultanpuri-A ward#DelhiMCDElectionResults2022 pic.twitter.com/Pg7fWhYMHL
— ANI (@ANI) December 7, 2022
నా కోసం కష్టపడి పనిచేసిన ప్రజలకు నా గెలుపును అంకితం చేయాలనుకుంటున్నాను. నేను అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. ఇప్పుడు నేను నా ప్రాంతంలో అభివృద్ధికి కృషి చేయాలి.
Before You Go
Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
ట్రెండింగ్ వార్తలు





















