అన్వేషించండి
Advertisement
Mann Ki Baat: అవినీతి రహిత భారతావనే లక్ష్యం.. దానికి ఇదే మార్గం: మోదీ
జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్ జ్యోతి విలీనంపై ప్రధాని నరేంద్ర మోదీ.. మన్‌కీ బాత్‌లో స్పందించారు.
2022 ఏడాదిలో తన తొలి మన్‌కీ బాత్ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మహాత్మా గాంధీ వర్ధంతి, గణతంత్ర వేడుకలు సహా పలు అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడారు.
హైలెట్స్..
- ఇండియా గేట్ వద్ద ఉన్న అమర జవాన్ జ్యోతిని, జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతితో కలిపిన క్షణం అమరుల కుటుంబీకులు భావోద్వేగానికి గురయ్యారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ సమయంలో వారి కళ్లు చెమర్చాయని మోదీ అన్నారు.
- ఈ జ్యోతి విలీనం చేయడాన్ని హర్షిస్తూ ఎందరో మాజీ సైనికులు తనకు లేఖ రాశారని మోదీ అన్నారు. జాతీయ యుద్ధ స్మారకంలో అమర జవాన్ జ్యోతిని విలీనం చేసి అమరులకు ఘన నివాళి ఇచ్చినట్లు అయిందని వారు లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు
- ఈ మన్‌కీ బాత్ కోసం దాదాపు కోటి పోస్ట్ కార్డులు తనకు పిల్లలు పంపించారని మోదీ అన్నారు. తమ మన్‌కీ బాత్‌ను వారు పోస్ట్ కార్డ్‌లో రాసి పంపారన్నారు.
We make a relationship of love with every conscious being. We also got to see a similar sight this time in the Republic Day parade as well. In this parade, the charger mount of the President's Bodyguard, Virat took part in his last parade: PM @narendramodi #MannKiBaat #PMOnAIR pic.twitter.com/GZe4wMI5Xn
— All India Radio News (@airnewsalerts) January 30, 2022
-
రాష్ట్రపతి బాడీగార్డ్ కమాండెంట్ సవారీ చేసే గుర్రం విరాట్ ఇటీవల పదవీ విరమణ పొందడాన్ని కూడా మన్‌కీ బాత్‌లో మోదీ ప్రస్తావించారు.
- కరోనాపై భారత్.. విజయవంతంగా పోరాటం చేస్తోందని మోదీ అన్నారు. ఇప్పటికే 4.5 కోట్ల మంది చిన్నారులు వ్యాక్సిన్ పొందడం గర్వంగా ఉందన్నారు.
- అవినీతి చెదపురుగు వంటిదని మోదీ పేర్కొన్నారు. దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసే అవినీతి నుంచి భారత్‌కు వీలైనంత త్వరగా విముక్తి కలిగించాలన్నారు. మన విధులకు ప్రాధాన్యం ఇస్తే అవినీతి ఉండదని మోదీ సూచించారు.
Also Read: Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు.. ఒక్కరోజులో 893 మంది మృతి
Also Read: Canada PM Justin: అజ్ఞాతంలోకి ఆ దేశ ప్రధాని.. వ్యాక్సిన్ వ్యతిరేక ఆందోళనలతో కెనడా ఉక్కిరిబిక్కిరి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
హైదరాబాద్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion