అన్వేషించండి

IT Raids: మాజీ కానిస్టేబుల్ ఇంట్లో రైడ్స్- 40 కిలోల వెండి, నోట్ల కట్టలు స్వాధీనం

IT Raids: మధ్యప్రదేశ్ రవాణా శాఖకు చెందిన మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ నుంచి లోకాయుక్త పోలీసులు రూ. 2.85 కోట్ల నగదుతో సహా రూ.3 కోట్లకు పైగా ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఒక రోజు తర్వాత ఈ ఘటన జరిగింది.

IT Raids : మధ్యప్రదేశ్ లో భారీగా వెండి, నోట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లోకాయుక్త జరిపిన తనిఖీల్లో సుమారు 40కిలోల వెండితో పాటు కొంత నగదును కూడా రికవరీ చేశారు. ర‌వాణా శాఖ‌లో కానిస్టేబుల్‌గా చేసిన వ్య‌క్తి ఇంట్లో లోకాయుక్త చేపట్టిన సెర్చింగ్ లో ఇవి బట్టబయలయ్యాయి. డిసెంబర్ 21న భోపాల్ లో చేసిన రైడ్ లో నోట్ల కట్టలు, 40 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్టు లోకాయుక్త వెల్లడించింది.

అంతకుముందు డిసెంబర్ 20న కూడా రవాణా శాఖకు చెందిన మాజీ కానిస్టేబుల్ నివాసాల నుండి లోకాయుక్త పోలీసులు రూ. 2.85 కోట్ల నగదుతో సహా రూ. 3 కోట్లకు పైగా ఆస్తులను రికవరీ చేసిన ఒక రోజు తర్వాత ఈ ఘటన జరిగింది. నగదుతోపాటు రూ.50 లక్షల విలువైన బంగారం, కొంత వెండిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తులకు సంబంధించిన పత్రాలు సైతం వారికి దొరికాయని, వాటిని పరిశీలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.

అరేరా కాలనీలోని మాజీ ఆర్టీఓ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ, అతని సన్నిహితుడు చందన్ సింగ్ గౌర్ నివాసంపై లోకాయుక్త డిసెంబర్ 20న ఉదయం దాడి చేశారు. కొన్ని గంటల తర్వాత జప్తు చేయడం గమనార్హం. శర్మ గత సంవత్సరం రవాణా శాఖ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చురుకుగా ఉన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం, నగదు సౌరభ్ శర్మ సన్నిహితుడికి సంబంధించినవిగా భావిస్తున్నారు.

 
మెండోరి జంగిల్‌లోని నిర్మాణంలో ఉన్న భవనంలో తెల్లటి రంగులో ఉన్న ఇన్నోవా క్రిస్టా—MP 07 BA 0050— డిసెంబర్ 19, 20 మధ్య రాత్రి సమయంలో గుర్తించారు. ఆదాయపు పన్ను శాఖ టార్గెట్ లిస్టులో ఉన్న చేతన్ గౌర్ పేరుతో కారు రిజిస్టర్ అయినట్లు సమాచారం. వాహనం బంపర్‌పై RTO అనే ఎర్రటి ప్లేట్‌ను కలిగి ఉందని కూడా చెప్పారు. కారులో 52 కిలోల బంగారు కడ్డీలు, నగదుతో కూడిన బ్యాగులు (రూ.100, రూ. 500 నోట్లు కలిపి రూ.10 కోట్లు) స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం ప్రకారం, బంగారం, నగదును రాష్ట్రం నుంచి తరలిస్తున్నట్లు ఐటీ శాఖ అధికారులు చెప్పారు. బంగారాన్ని స్వాధీనం చేసుకునేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో 100 మంది పోలీసులు పాల్గొన్నారు.

ఆపరేషన్‌లో భాగమైన ఒక సీనియర్ అధికారి ఫ్రీ ప్రెస్‌ మాట్లాడుతూ, "ఒక వాహనం దారిలో ఉందని, భారీ నగదు, బంగారాన్ని తీసుకువెళుతున్నట్లు మాకు గుర్తు తెలియని వ్యక్తి నుండి సమాచారం వచ్చింది. దాని ప్రకారం, మేము సంఘటన స్థలానికి చేరుకున్నాం". మెండోరి జంగిల్‌లో వదిలి వెళ్లిన కారు నుండి దాదాపు ఆరు నుండి ఏడు బ్యాగులను బృందం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. బ్యాగుల నిండా బంగారు కడ్డీలు, నగదు ఉన్నాయి. సుమారు రూ.10 కోట్ల నగదు రికవరీ అయినట్లు అంచనా.

Also Read : Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!

 
 

 

 

టాప్ హెడ్ లైన్స్

DK Shivakumar: కర్ణాటక ప్రజా ప్రతినిధులకు తిరుమల తొలిహారతి - డీకే శివకుమార్ వివాదాస్పద ప్రకటన !
కర్ణాటక ప్రజా ప్రతినిధులకు తిరుమల తొలిహారతి - డీకే శివకుమార్ వివాదాస్పద ప్రకటన !
Breaking News: ఆరుగురిని చంపిన రాజ్‌కుమార్ ఆత్మహత్య- మృతదేహం రికవరీ చేసుకున్న పోలీసులు 
ఆరుగురిని చంపిన రాజ్‌కుమార్ ఆత్మహత్య- మృతదేహం రికవరీ చేసుకున్న పోలీసులు 
TG TET 2026 Results: తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
Supreme Court: పోలవరం వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు, ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ
పోలవరం వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు, ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
Shabad Mass Murder Accused Selfie Video: అమ్మాయి కుటుంబం మోసం చేసింది - షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
అమ్మాయి కుటుంబం మోసం చేసింది - షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Embed widget