అన్వేషించండి

Lok Sabha Elections 2024: 1951 తరవాత రెండో అతి పెద్ద ఎన్నికల షెడ్యూల్ ఇదే, 82 రోజుల సుదీర్ఘ ప్రక్రియ

Lok Sabha Elections 2024: 1951 తరవాత రెండోసారి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ సుదీర్ఘంగా కొనసాగనుంది.

Lok Sabha Elections 2024 Schedule: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ని (Lok Sabha Elections 2024 Dates) ఈసీ వెల్లడించింది. మొత్తం 7 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఏప్రిల్ 19 న మొదటి విడత మొదలై జూన్ 1న మలి విడత పూర్తవుతుంది. గత లోక్‌సభ ఎన్నికలనూ ఇలాగే 7 విడతల్లో నిర్వహించింది ఈసీ. అన్నివిడతలు అంటే ఎన్నికల ప్రక్రియ చాలా సుదీర్ఘంగా సాగుతుంది. ఈసారి ఈ విడతల్ని తగ్గిస్తుందని భావించినా అదే తరహాలో కొనసాగించనున్నట్టు తెలిపింది. 1951-52 మధ్య కాలంలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు తొలిసారి ఇంత సుదీర్ఘంగా సాగాయి. ఇది రెండో అతి పెద్ద ఎన్నికల షెడ్యూల్. మొత్తంగా చూస్తే 44 రోజుల పాటు పోలింగ్ జరగనుంది. అయితే...నోటిఫికేషన్‌లు, నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ అన్నీ కలుపుకుంటే మొత్తంగా ఈ ఎన్నికల ప్రక్రియ 82 రోజుల పాటు కొనసాగనుంది. ఇన్ని రోజుల పాటు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో ప్రధాన కారణం..గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చి చూస్తే...ఈ సారి 6 రోజుల పాటు ఆలస్యంగా షెడ్యూల్‌ని విడుదల చేయడం. నిజానికి ఎప్పటిలాగే ఈ తేదీల్ని విడుదల చేయాలని ఈసీ భావించినా ఉన్నట్టుండి కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. మొత్తం ముగ్గురు సభ్యులతో కూడిన ఈ ప్యానెల్‌లో అప్పటికే ఓ ప్లేస్ వేకెన్సీ ఉంది. దానికి తోడు అరుణ్ గోయల్ కూడా వెళ్లిపోయారు. ఫలితంగా ఈ రెండు స్థానాల్ని భర్తీ చేయడానికి కాస్త సమయం పట్టింది. ఆ తరవాత సెలెక్షన్ కమిటీ కేరళకి చెందిన జ్ఞానేశ్ కుమార్, పంజాబ్‌కి చెందిన సుఖ్‌భీర్ సింగ్ సంధులను ఎన్నికల కమిషనర్లుగా నియమించింది. మార్చి 14న ఈ నియామకం జరగ్గా మార్చి 15న వాళ్లు బాధ్యతలు తీసుకున్నారు. ఆ మరుసటి రోజే అంటే మార్చి 16న ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. 

ఇక మార్చి,ఏప్రిల్ నెలల్లో వరుసగా పండుగలు ఉండడం కూడా ఎన్నికల షెడ్యూల్‌ గడువుని పెంచడానికి మరో కారణం. హోళీ, తమిళ కొత్త సంవత్సరం, బైశాఖి తదితర పండుగలున్నాయి. ఈ సెలవు రోజులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్‌లో మార్పులు చేసింది ఎన్నికల సంఘం. వీటితో పాటు భద్రతా కారణాలూ ఉన్నాయి. భద్రతా బలగాలు ఓ విడత ఎన్నికలు ముగిశాక మరో విడత ఎన్నికలకు వేరే చోటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇదంతా చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఇలా ప్రతి రెండు విడతల మధ్య ఓ చోటు నుంచి మరో చోటుకు వెళ్లాలంటే మొత్తంగా ఆరు రోజుల సమయం పడుతోంది. ఈ మధ్యలో పండుగ రోజులున్నాయి. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ గడువుకి ఎక్కడా ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంది ఈసీ. ఫలితంగానే ఇంత సుదీర్ఘంగా ఎన్నికల ప్రక్రియని నిర్వహించాల్సి వస్తోందని ఈసీ వర్గాలు వెల్లడించాయి. జూన్ 1వ తేదీన 7వ దశ పోలింగ్ ముగిసిపోతుంది. జూన్ 4వ తేదీన ఒకేసారి అన్ని ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

Also Read: హాస్టల్‌లో నమాజ్ చేసుకుంటున్న ముస్లిం విద్యార్థులపై మూకదాడి - జైశ్రీరామ్ నినాదాలు

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Embed widget