అన్వేషించండి

Parasitic Worm In Woman Brain: మహిళ మెదడులో కొండచిలువలో ఉండే పరాన్నజీవి - డాక్టర్లు షాక్

Parasitic Worm In Woman Brain : ఓ మహిళ మెదడు నుంచి డాక్టర్లు బతికి ఉన్న పరాన్నజీవి (పారాసైట్‌)ను బయటకు తీశారు. అది బయటకు తీసిన తర్వాత కూడా కదులుతూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది.

Live Parasitic Worm In Woman Brain :ఆస్ట్రేలియాలో వైద్యులనే షాక్‌కు గురి చేసే సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ మెదడు నుంచి డాక్టర్లు బతికి ఉన్న పరాన్నజీవి (పారాసైట్‌)ను బయటకు తీశారు. అది బయటకు తీసిన తర్వాత కూడా కదులుతూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ పరాన్న జీవి ఏకంగా 8 సెంటీమీటర్లు ఉంది. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

మతిమరుపు, డిప్రెషన్‌ లక్షణాలు.. 
64 ఏళ్ల ఓ మహిళ చాలా  రోజులుగా కడుపునొప్పి, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలతో ఇబ్బందులు పడుతోంది. వీటి కోసం ఎన్నో సార్లు మందులు వాడింది. ఆ తర్వాత రాత్రి పూట చమటలు, పొడి దగ్గు లాంటి లక్షణాలు కనిపించాయి. తొలుత 2021 జనవరి లో ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కాగా ఎలాంటి ఫలితం లేకపోగా ఈ మధ్య మతిమరుపు, డిప్రెషన్‌ వంటి లక్షణాలు కనిపిస్తుండడంతో ఆమెను కాన్‌బెర్రా ఆస్పత్రిలో చేరారు. ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయగా మెదడులో సమస్య ఉందని ఆపరేషన్‌ చేయాలని వైద్యులు తెలిపారు. 

సర్జరీ సమయంలో మెదడులో కదులుతున్న పరాన్నజీవిని గుర్తిస్తామని అనుకోలేదని వైద్యులు తెలిపినట్లు కాన్‌బెర్రా ఆసుపత్రి అంటువైద్యుల డాక్టర్‌ సంజయ సేనానయకే గార్డియన్‌ పత్రికతో వెల్లడించారు. న్యూరో సర్జన్లు రెగ్యులర్‌గా మెదడులో ఇన్ఫెక్షన్లను గుర్తిస్తారని, కానీ ఇలా పారసైట్‌ కనిపించడం కెరీర్‌లో ఒక్కసారే జరిగే ఘటన లాంటిదని పేర్కొన్నారు. ఇది వైద్య చరిత్రలో అరుదైన ఘటనగా వారు వెల్లడించారు.

మెదడులో గుర్తించిన పరాన్నజీవిని ఓఫిడాస్కారిస్‌ రాబర్టీస్‌ నెమటోడ్‌ జాతికి చెందినదిగా గుర్తించినట్లు చెప్పారు. ఈ తరహా పరాన్నజీవులు ఎక్కువగా న్యూసౌత్‌వేల్స్‌లో ఉండే ఒక రకమైన కొండచిలువల (కార్పెట్‌ పైథాన్స్‌) జీర్ణాశయాలలో నివసించడాన్ని గుర్తించారు. ఈ ఘటనను ఎమర్జింగ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ అనే జర్నల్‌లో డాక్యుమెంట్‌ చేశారు. ఈ కేసు చరిత్రలో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని వైద్యులు వెల్లడించారు. 

ఆపరేషన్‌ అనంతరం వైద్యులు సజీవంగా ఉన్న ఆ పరాన్నజీవిని నేరుగా పరాన్నజీవులపై చాలా అనుభవం ఉన్న శాస్త్రవేత్తకు చెందిన ప్రయోగశాలకు పంపించినట్లు వైద్యులు తెలిపారు. ఆ శాస్త్రవేత్త దీనిని చూడగానే ఇది ఓఫిడాస్కారిస్‌ రాబర్జీస్‌ అని చెప్పినట్లు వెల్లడించారు. కొండచిలువలు గడ్డి లేదా ఆకులపై విసర్జించిన వ్యర్థాల కారణంగా మహిళ శరీరంలోకి ఈ జీవి వెళ్లి ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మహిళ ఆకుకూరలు ఇంటికి తీసుకురావడం వల్ల ఆ జీవికి సంబంధించిన గుడ్లు వంటపాత్రలు లేదా ఆహారం ద్వారా ఆమె శరీరంలోకి వెళ్లి లార్వాగా మారి ఉండొచ్చని చెప్తున్నారు. ఈ కేసు కారణంగా జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధుల ప్రమాదాల గురించి తెలియజేస్తోందని వైద్యులు తెలిపారు.

జంతువులను పెంచుకునేవాళ్లు జాగ్రత్తగా ఉండాలి 
బాధితురాలు ఆపరేషన్‌ తర్వాత నెమ్మదిగా కోలుకుంటోందని డాక్టర్లు తెలిపారు. ప్రపంచంలో సంక్రమిస్తున్న అంటువ్యాధులలో 75 శాతం జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులే ఉంటున్నాయని వారు వెల్లడించారు. ఇవి జూనోటిక్‌ వ్యాధులని చెప్పారు. అందుకే జంతువులను పెంచుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా ఆహారపదార్థాలు బయట నుంచి తెచ్చుకుని తినేప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఉడికించిన ఆహారం తీసుకోవడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Knight Riders Creates History: అమెరికాలో షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్ గ్రూప్ సంచలనం.. లాస్ ఏంజిల్స్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టేడియం ఓపెనింగ్, హిస్టరీ క్రియేట్ చేసిన బాలీవుడ్ బాద్‌షా!
నైట్ రైడర్స్ గ్రూప్ సంచలనం.. లాస్ ఏంజిల్స్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టేడియం ఓపెనింగ్, హిస్టరీ క్రియేట్ చేసిన బాలీవుడ్ బాద్‌షా!
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
FIFA Knockout Thriller: 24 ఏళ్ల త‌ర్వాత తొలిసారి ప్రిక్వార్ట‌ర్స్ లోకి యూఎస్ఏ, బోస్నియాపై ఈజీ విక్ట‌రీ!
24 ఏళ్ల త‌ర్వాత తొలిసారి నాకౌట్ మ్యాచ్ గెలిచిన యూఎస్ఏ, బోస్నియాపై ఈజీ విక్ట‌రీ!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Super Subbu OTT : ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
Jana Nayagan Release Date : జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Embed widget