లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కి షాక్, అరెస్ట్ నుంచి మినహాయింపు కుదరదన్న కోర్టు
Liquor Policy Case: ఈడీ అరెస్ట్ నుంచి మినహాయింపుని కోరుతూ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
Delhi Liquor Policy Case: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి గట్టి షాక్ ఇచ్చింది హైకోర్టు. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు కేజ్రీవాల్. ఈ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము ఈ కేసులో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. అయితే..ఈ పిటిషన్‌పై స్పందించాలని ఈడీని ఆదేశించింది. ఏప్రిల్ 22వ తేదీన మరోసారి విచారణ జరుపుతామని వెల్లడించింది.
Delhi HC refuses to grant any interim protection from coercive action to Delhi CM Arvind Kejriwal and said at this stage we are not inclined to grant an interim relief.
— ANI (@ANI) March 21, 2024
However, the court sought a response from ED on this fresh interim plea and listed the matter for April 22,… pic.twitter.com/Laxg9TbY3f
ఈడీ సమన్లు జారీ చేయకుండా స్టే విధించాలని కూడా కేజ్రీవాల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు మార్చి 20వ తేదీన విచారణ జరిపించింది. స్టే విధించడం కుదరదని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో ఈడీని వివరణ కోరింది. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ని తిరస్కరించిన కొద్ది గంటల్లోనే కేజ్రీవాల్ మరో పిటిషన్ వేశారు. తనను అరెస్ట్ చేయకుండా మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇప్పుడు ఈ అభ్యర్థననీ కోర్టు తిరస్కరించింది.