అన్వేషించండి

Kerala Robotic Elephant: దేవుడి సేవలో తరిస్తున్న రోబో ఏనుగు, కేరళలోని ఆలయానికి పెటా గిఫ్ట్

Kerala Robotic Elephant: కేరళలోని ఓ ఆలయానికి రోబో ఏనుగుని అందజేసింది పెటా సంస్థ.

 Kerala Robotic Elephant:

రోబో ఏనుగు..

దేవాలయ ఉత్సవాల్లో ఏనుగులదే కీలక పాత్ర. వీటిపైనే ఊరేగింపులు  ఉంటాయి. ముఖ్యంగా కేరళలోని ఆలయాల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. ప్రత్యేకంగా వాటికి శిక్షణనిస్తారు. అయితే...వేడుకల పేరుతో మూగ జీవాలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే కేరళలోని నలుగురు యువకులు రోబో ఏనుగుని (robotic elephant) తయారు చేశారు. కేరళలోని ఆలయాల్లో భక్తులకు ఏనుగులు తొండంతో ఆశీర్వదిస్తాయి. అక్కడ ఇదో ఆచారం. ఇందుకోసం వాటికి చాలా ట్రైనింగ్ ఇస్తారు. వాటిని ఇబ్బంది పెట్టే బదులు రోబో ఏనుగుని తీసుకొస్తే బాగుంటుందన్న ఆలోచనతో నలుగురు దీన్ని రూపొందించారు. చూడటానికి అచ్చం నిజం ఏనుగులానే ఉండేలా తీర్చి దిద్దారు. ఇది రోబో ఏనుగు అని చెబితే కానీ గుర్తించలేని విధంగా అద్భుతంగా తయారు చేశారు. 11 అడుగులు పొడవుతో, 800 కిలోల బరువుతో దీన్ని రూపొందించారు. ఐరన్‌ ఫ్రేమ్, రబ్బర్ కోటింగ్‌ వినియోగించారు. త్రిశూర్‌లోని ఇరింజదప్పిల్లీ శ్రీకృష్ణ ఆలయానికి దీన్ని డొనేట్ చేశారు. పెటా సమక్షంలో ఆలయానికి విరాళంగా ఇచ్చారు. సినీ నటి పార్వతి తిరువోతు చేతుల మీదుగా ఈ ఏనుగుని అందజేశారు. ఇంతకు దీన్ని తయారు చేయడానికి ఎంత ఖర్చైందో తెలుసా..? అక్షరాల రూ.5 లక్షలు. అప్పుడే దీనికి "Irinjadappilly Raman" అని పేరు కూడా పెట్టారు. నిజమైన ఏనుగులు ఎలా అయితే ఆశీర్వదిస్తాయో..అదే విధంగా ఈ రోబోటిక్ ఏనుగు భక్తులకు ఆశీర్వాదం అందిస్తోంది. 5 పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ మోటార్స్‌తో ఈ ఎలిఫెంట్ మోడల్‌ను రూపొందించారు. 

ఈ ఏనుగుపై ఒకేసారి ఐదుగురు కూర్చోవచ్చు. స్విచ్ సాయంతో ఏనుగు తొండాన్ని ఆపరేట్ చేసేందుకు వీలుంటుంది. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌కు ఏనుగు విగ్రహాలు తయారు చేసి పంపే బృందమే ఈ రోబోటిక్ ఏనుగుని తయారు చేసింది. దీనిపై ఆలయ అర్చకులు ఆనందం వ్యక్తం చేశారు. అన్ని ఆలయాల్లోనూ నిజమైన ఏనుగులకు బదులుగా ఈ రోబో ఏనుగులను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఏనుగులు వేడుకలు జరిగినప్పుడు ఉన్నట్టుండి భక్తులపై దాడి చేస్తున్నాయని, రోబో ఏనుగులతో ఆ బాధలు తప్పుతాయని అంటున్నారు. పెటా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. వీలైనంత వరకూ ఆలయాల్లో రోబో ఏనుగులను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion: కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
IND VS WI Series Alive Drama: విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం

వీడియోలు

IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget